Wedding: రేయ్.. ఎవర్రా మీరంతా.. పెళ్లిలో ఆహారం లేదని ఫ్యాక్టరికీ నిప్పు పెట్టిన ఉద్యోగులు.. చివరకు..
ఫ్యాక్టరీ యజమాని కృష్ణ వివాహం బుధవారం జరిగింది. ఇంటి పక్కన ఉన్న సెలబ్రేషన్ మ్యారేజ్ హాల్‌లో వివాహ రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేశారు. వివాహ వేడుకలో విందుని ఆహుతులు అందరూ తిన్నారు. అర్థరాత్రి సమయం అయ్యే సరికి ఆహారం తక్కువ అయింది. ఈ సమయంలో ముగ్గురు ఫ్యాక్టరీ ఉద్యోగులు వచ్చినా ఆహారం లభించలేదు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఉద్యోగులు ఆహారం కోసం వేడుకలో వీరంగం సృష్టించారని ఆరోపించారు.

యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. పేపర్‌కప్ ఫ్యాక్టరీ ఓనర్ ఇంట్లో పెళ్లి అంగరంగ వైభవంగా సాగుతోంది. ఈ వేడుకలో భోజనం చేస్తున్న సమయంలో ఉద్యోగులు వీరంగం సృష్టించారు. దీంతో ఫ్యాక్టరీ యజమాని కుటుంబసభ్యులు ఉద్యోగులను తరిమి కొట్టడంతో ఆగ్రహించిన ఉద్యోగులు ఫ్యాక్టరీకి నిప్పు పెట్టారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అగ్ని ప్రమాదంలో రూ.65 లక్షల నష్టం వాటిల్లినట్లు ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. అయితే ఫ్యాక్టరీకి ఉద్యోగస్తులు నిప్పు పెట్టారు అన్న ఆరోపణలను ఉద్యోగులు ఖండించారు. విద్యుత్ చోరీకి గురై షార్ట్‌సర్క్యూట్ జరగడంతో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయని చెప్పారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని తెలిపారు.
ఈ ఘటన భైరోపూర్ ప్రాంతంలోని ఎయిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కృష్ణ జైస్వాల్ ఇల్లు వెనుక భాగంలో రాజ్ అండ్ ప్రిన్స్ ఇండస్ట్రీస్ , సిద్ధి వినాయక్ డిస్పోజల్ పేరుతో రైస్ మిల్లు, పేపర్ కప్పుల తయారీ కర్మాగారం ఉంది. ఫ్యాక్టరీ యజమాని కృష్ణ వివాహం బుధవారం జరిగింది. ఇంటి పక్కన ఉన్న సెలబ్రేషన్ మ్యారేజ్ హాల్‌లో వివాహ రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేశారు. వివాహ వేడుకలో విందుని ఆహుతులు అందరూ తిన్నారు. అర్థరాత్రి సమయం అయ్యే సరికి ఆహారం తక్కువ అయింది. ఈ సమయంలో ముగ్గురు ఫ్యాక్టరీ ఉద్యోగులు వచ్చినా ఆహారం లభించలేదు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఉద్యోగులు ఆహారం కోసం వేడుకలో వీరంగం సృష్టించారని ఆరోపించారు. ఉద్యోగస్తులను కృష్ణ జైస్వాల్ బంధువు పింటూ, మరో అరడజను మంది వ్యక్తులు పెళ్లి వేడుక నుంచి పంపించి వేశారు.
దీంతో ఆగ్రహించిన ఆ ముగ్గురు ఉద్యోగులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని నిప్పంటించారని ఫ్యాక్టరీ యజమాని ఆరోపించారు. మంటల్లో ఫ్యాక్టరీ మొత్తం దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి చాలా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చింది. ఫ్యాక్టరీ యజమాని కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు సేల్స్‌మెన్ రాజేష్ దుషాద్, విపుల్ పాశ్వాన్, కిషన్ గుప్తాలపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..