AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Divorce: ‘డబ్బాల మూతలు గట్టిగా పెడుతున్నాడనీ..’ భర్తకు విడాకులు ఇచ్చిన భార్య

నేటి కాలం పెళ్లిళ్లు.. మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగుస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుని కన్నోళ్లకు వేదన మిగులుస్తున్నారు. తాజాగా ఓ ఇల్లాలు తన భర్త డబ్బాలకు మూతలు బిగుతుగా పెడుతన్నాడన్న కారణంతో ఏకంగా విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఇది విన్నవారంతా అవాక్కవుతున్నారు. అదేంటి.. ఇలాంటి కారణాలకు కూడా విడాకులు తీసుకుంటారా? అని ముక్కున వేలేసుకుంటున్నారు..

Divorce: 'డబ్బాల మూతలు గట్టిగా పెడుతున్నాడనీ..' భర్తకు విడాకులు ఇచ్చిన భార్య
Husband Tightening Jar Lids
Srilakshmi C
|

Updated on: Jun 26, 2024 | 8:11 PM

Share

నేటి కాలం పెళ్లిళ్లు.. మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగుస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకుని కన్నోళ్లకు వేదన మిగులుస్తున్నారు. తాజాగా ఓ ఇల్లాలు తన భర్త డబ్బాలకు మూతలు బిగుతుగా పెడుతన్నాడన్న కారణంతో ఏకంగా విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఇది విన్నవారంతా అవాక్కవుతున్నారు. అదేంటి.. ఇలాంటి కారణాలకు కూడా విడాకులు తీసుకుంటారా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. నెట్టింట రెడ్డిట్‌ పోస్టులో ఈ వ్యవహారం వెలుగు చూడటంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

పేరు తెలియని ఓ యువతి రెడ్డిట్‌లో తన భర్తతో తాను పడుతున్న ఇబ్బందులను రాసుకొచ్చింది. తన ఇంట్లో ఆవకాయ పచ్చళ్ల మూతలు, ఇతర డబ్బాల మూతలను తన భర్త గట్టిగా పెడుతున్నాడని, వాటిని తెరవడానికి తాను ఎన్నోసార్లు తీవ్ర ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. మూత గట్టిగా పెట్టడం వల్ల డబ్బాల్లోని ఆహారం ఫ్రెష్‌గా ఉంటుందని తొలినాళ్లలో ఆమె భర్త చెప్పాడట. మూత గట్టిగా పెట్టినా, వదులుగా పెట్టినా అందులోని ఆహారం ఎలాగూ పాడవుతుంది. అది ఎలాగున్నా తనకు ఇబ్బంది లేదని, మూత గట్టిగా పెట్టడం వల్ల తాను కోరుకున్న సమయంలో ఆహారం తినలేకపోతున్నానని, కొన్ని సందర్భాల్లో పొరుగింటి వారి సాయంతో డబ్బాల మూతలు తీసుకోవల్సి వస్తుందని చెప్పుకొచ్చింది. 5 యేళ్ల తరబడి ఇలా బిగించిన డబ్బాల మూతలు తెరవలేక అవస్తలు పడుతున్నట్లు తన గోడు వెళ్లగక్కింది. పైగా తన భర్త ఉద్ధేశ్యపూర్వకంగానే ఇలా డబ్బాల మూతలు బిగుతుగా పెడుతున్నట్లు గుర్తించడంతో.. ఆమె భర్త క్షమాపణలు తెలిపారు. అయితే అప్పటికే ఆలస్యమై పోయిందట..

భర్త చర్యలతో విసిగిపోయిన ఆమె అప్పటికే విడాకులకు దాఖలు చేసింది. వారి వివాహలో ఉన్న ఏకైక సమస్య డబ్బాల మూతలు బిగుతుగా పెట్టడమేనట. అయితే తాను ఇదంతా కావాలని చేస్తున్నట్లు భార్య ముందు అంగీకరించకపోవంతో ఆమె కోపం నషాలానికి అంటింది. ప్రతిరోజూ డబ్బాల మూతలు తీయడానికి కష్టపడాల్సి వస్తుందని, ఈ విషయంపై చాలాసార్లు గొడవపడ్డామని, ఇక లాభంలేదని అందుకే తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు కోర్టులో సదరు మహిళ చేసిన ఫిర్యాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతను ఇంట్లో ఉన్నప్పుడు డబ్బాల మూతలు అతడే తెరుస్తున్నాడని, కానీ బయటకు వెళ్లినప్పుడు, డబ్బా మూత తీయడానికి చాలా కష్టపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. గత ఐదేళ్లుగా ఈ సమస్యతో మానసికంగా బాధపడుతున్నాని ముక్కు ఛీదేసింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.