AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేజ్రీవాల్‌కు మరోసారి షాక్‌.. మూడు రోజుల కస్టడీకి అప్పగించిన ఢిల్లీ కోర్టు

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేజ్రీవాల్‌కు మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది కోర్టు. ఈ స్కాంలో అసలు సూత్రధారులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉందని, మిగతా నిందితులతో ఆయన్ను కలిసి విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది.

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేజ్రీవాల్‌కు మరోసారి షాక్‌.. మూడు రోజుల కస్టడీకి అప్పగించిన ఢిల్లీ కోర్టు
Arvind Kejriwal
Shaik Madar Saheb
|

Updated on: Jun 26, 2024 | 8:05 PM

Share

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేజ్రీవాల్‌కు కష్టాలు రెట్టింపయ్యాయి. కేజ్రీవాల్‌ను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది రౌస్‌ అవెన్యూ కోర్టు. ఐదు రోజుల పాటు విచారించేందుకు కేజ్రీవాల్‌ను ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరింది. అయితే మూడు రోజుల పాటే కస్టడీకి అనుమతిస్తూ ధర్మాసనం ఆదేశాలిచ్చింది.. తిరిగి ఈనెల 29వ తేదీన కేజ్రీవాల్‌ను తిరిగి కోర్టులో సీబీఐ ప్రవేశపెట్టనుంది. ఉదయం కేజ్రీవాల్‌ను తిహార్‌ జైలు నుంచి సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే తనపై సీబీఐ అధికారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోర్టుకు తెలిపారు కేజ్రీవాల్‌. లిక్కర్‌ స్కామ్‌ సూత్రధారిగా మనీష్‌ సిసోడియా పేరును తాను విచారణ తెలిపినట్టు ప్రచారం చేశారని, కాని ఇది నిజం కాదన్నారు. తనతో పాటు సిసోడియా, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ కేసులో నిర్ధోషులమని స్పష్టం చేశారు.

లిక్కర్‌ స్కాం కుట్ర గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని అందుకే కేజ్రీవాల్‌ను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 43 కోట్ల హవాలా మనీని ఆప్‌ ఉపయోగించిందని, లిక్కర్‌ స్కాంలో వసూలు చేసిన డబ్బు తోనే అక్కడ ఖర్చు చేశారని సీబీఐ ఆరోపించింది. విజయ్‌ నాయర్‌ , ఆతిషి , సౌరభ్‌ భరద్వాజ్‌ లాంటి నేతలు లిక్కర్‌ స్కాం అంతా మనీష్‌ సిసోడియాకే తెలుసని అంటున్నారని, దీనిపై వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

లిక్కర్‌ స్కాంకు సంబంధించి ఈడీ కేసులో ట్రయల్‌ కోర్టు కేజ్రీవాల్‌కు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ను వేసిన కేజ్రీవాల్‌ సీబీఐ కేసుతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. సుప్రీంకోర్టు నుంచి పిటిషన్‌ వెనక్కి తీసుకున్నారు. మరోసారి సమగ్ర సమాచారంతో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తామని తెలిపారు కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..