Indigo Flight: ఇండిగో విమానంలో వెకిలి చేష్టలు.. అర్ధరాత్రి పక్క సీట్లో కూర్చున్న మహిళా ప్రయాణికురాలిని..

భయపడిపోయిన బాధితురాలు..గట్టిగా అరిచానని చెప్పింది. వెంటనే సీట్ లైట్లు ఆన్ చేసి క్యాబిన్ సిబ్బందిని పిలిచింది..మహిళా ప్రయాణికురాలు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో విమానం దిగిన వెంటనే గౌహతిలో సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించినట్లు ఇండిగో ప్రకటించింది. ఇదిలా ఉంటే,.. గత 3 నెలల్లో విమానంలో ఇలాంటి వేధింపుల సంఘటనలు ఇది ఐదవది.

Indigo Flight: ఇండిగో విమానంలో వెకిలి చేష్టలు.. అర్ధరాత్రి పక్క సీట్లో కూర్చున్న మహిళా ప్రయాణికురాలిని..
Indigo Flight
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 11, 2023 | 6:17 PM

Indigo Flight: విమానంలో మరో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. విమానాల్లో ప్రయాణికుల వికృత చేష్టలు, మహిళలపై లైంగిక వేధింపుల కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు తరుచూ జరుగుతుండటం ప్రయాణికులు, సిబ్బందిలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.. తాజాగా, ముంబయి నుంచి గౌహతి వెళ్తున్న ఇండిగో విమానంలో తన పక్క సీటులో కూర్చున్న మహిళ పట్ల ఓ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో నిందితుడ్ని పోలీసులకు అప్పగించారు విమానాశ్రయ సిబ్బంది. మూడు నెలల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది ఐదోసారి.

ముంబై నుంచి గౌహతి వెళుతున్న విమానంలో అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. శనివారం అర్థరాత్రి ముంబై నుంచి గౌహతి వెళ్లే విమానంలో క్యాబిన్ లైట్లు డిమ్ చేసిన క్రమంలో విమానంలోని ఓ ప్రయాణికుడు.. తన తోటి మహిళా ప్రయాణీకురాలిని పదేపదే తాకుతూ అసభ్యంగా ప్రవర్తించినట్లుగా బాధిత మహిళ ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, సదరు వ్యక్తిని గౌహతిలోని పోలీసులకు అప్పగించినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. గత రెండు నెలల్లో విమానాల్లో భారతీయ ప్రయాణీకులపై లైంగిక వేధింపుల కేసులు వెలుగులోకి రావటం తీవ్ర కలకలం రేపుతోంది.

తాజాగా సంఘటన ఇండిగో ఫ్లైట్ 6E-5319లో శనివారం రాత్రి జరిగింది. రాత్రి 9 గంటల తర్వాత ముంబై నుంచి బయలుదేరి అర్ధరాత్రి 12:15 గంటలకు గౌహతి చేరుకుంది విమానం. బాధిత మహిళ మాట్లాడుతూ.. క్యాబిన్ లైట్లు డిమ్ చేయడంతో తాను నిద్రలోకి జారుకున్నానని చెప్పారు. ఆమె నిద్రపోయే ముందు ఆర్మ్‌రెస్ట్‌లను తగ్గించింది. ఈ క్రమంలోనే సహ ప్రయాణికుడు తనను పదే పదే తడుముతున్నట్టుగా, అనుచితంగా తాకినట్లు ఆమె ఆరోపించింది. దాంతో భయపడిపోయిన బాధితురాలు..గట్టిగా అరిచానని చెప్పింది. వెంటనే సీట్ లైట్లు ఆన్ చేసి క్యాబిన్ సిబ్బందిని పిలిచింది..మహిళా ప్రయాణికురాలు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో విమానం వచ్చిన తర్వాత గౌహతిలో సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించినట్లు ఇండిగో ప్రకటించింది. ఇదిలా ఉంటే,.. గత 3 నెలల్లో విమానంలో ఇలాంటి వేధింపుల సంఘటనలు ఇది ఐదవది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!