Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Summit: భారత్‌ మమ్మల్ని గౌరవించింది.. జీ20 సమ్మిట్‌కు ఆహ్వానంపై బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు

జీ 20 సమావేశాలు ముగింపు సందర్బంగా ప్రధాని ప్రతిపాదించిన 'వన్ ఎర్త్ నేషన్'పై సభ్యదేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇక జీ20 సమావేశాలు జరుగుతన్న సమయంలో ప్రధాని పలు ప్రపంచ దేశాల అధ్యక్షులతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగా తొలిరోజు బంగ్లాదేశ్‌తో పాటు మారిషస్‌, రెండో రోజు యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఇదిలా ఉంటే జీ20 శిఖరాగ్ర సమావేశానికి తమను ఆహ్వానించడంపై పలు దేశాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఇక జీ20 సభ్యత్వ దేశం కానీ బంగ్లాదేశ్‌కు భారత్‌ ఆహ్వానం పలకడం ఆ దేశం హర్షం వ్యక్తం చేసింది...

G20 Summit: భారత్‌ మమ్మల్ని గౌరవించింది.. జీ20 సమ్మిట్‌కు ఆహ్వానంపై బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు
Sheikh Hasina, Pm Narendra Modi
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 11, 2023 | 6:19 PM

ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సమావేశాలు అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాధినేతలు హాజరైన జీ20 సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు గాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మొదటిసారి భారత్‌లో పర్యటించారు. సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే అమెరికా, భారత్‌ల మధ్య దైపాక్షిక చర్చల్లో భాగంగా బైడెన్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

జీ 20 సమావేశాలు ముగింపు సందర్బంగా ప్రధాని ప్రతిపాదించిన ‘వన్ ఎర్త్ నేషన్’పై సభ్యదేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇక జీ20 సమావేశాలు జరుగుతన్న సమయంలో ప్రధాని పలు ప్రపంచ దేశాల అధ్యక్షులతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగా తొలిరోజు బంగ్లాదేశ్‌తో పాటు మారిషస్‌, రెండో రోజు యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలతో సమావేశమయ్యారు. ఇదిలా ఉంటే జీ20 శిఖరాగ్ర సమావేశానికి తమను ఆహ్వానించడంపై పలు దేశాలు సంతోషం వ్యక్తం చేశాయి. ఇక జీ20 సభ్యత్వ దేశం కానీ బంగ్లాదేశ్‌కు భారత్‌ ఆహ్వానం పలకడం ఆ దేశం హర్షం వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

జీ20 సమావేశాలకు తమను అతిథి సభ్యులిగా ఆహ్వానించిన ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి అబ్దుల్‌ మోమెన్‌ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ ఆహ్వానం తమకు గౌరవమని ఆయన అభిప్రాయపడ్డారు. సమ్మిట్‌ జరిగిన సమయంలో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాను ఇతర నేతలను కలవమని ప్రోత్సహించినట్లు మోమెన్‌ చెప్పుకొచ్చారు. మీడియాతో మాట్లాడిన బంగ్లా విదేశాంగ మంత్రి.. బంగ్లాదేశ్‌ను అతిథి దేశంగా ఆహ్వానించడం పట్ల షేక్‌ హసీనా సైతం ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారన్నారు. బంగ్లాదేశ్‌ గ్లోబల్ సౌత్‌ సమస్యలను లేవనెత్తుతోందన్న అబ్దుల్‌.. మహిళా సాధికారత,విపత్తు నిర్వహణలో తమ దేశం అగ్రగామిగా ఉందని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన బంగ్లా ప్రధాని హసినా, అదే రోజు ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇందులో భాగంగా డిజిటల్‌ పేమెంట్‌ మెకానిజమ్స్‌లో సహకారంతో సహా రెండు దేశాల మధ్య మొత్తం మూడు అవగాహన ఒప్పందాలు జరిగాయి. డిజిటల్‌ పేమెంట్‌ మెకానిజంలో సహకారంపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు బంగ్లాదేశ్‌కు మధ్య ఎమ్‌ఓయూ కుదిరింది. 2023-25 కోసం భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం (కల్చరల్‌ ఎక్సేంజ్‌ ప్రోగ్రామ్‌)పై ఇరు దేశాలు దృష్టిసారించాయి. ఇక ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌, బంగ్లాదేశ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ల మధ్య మరో ఒప్పందం కుదిరింది.

ఇక జీ20 సమ్మిట్ జరుగుతోన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో పాటు తన కూతురుతో కలిసి సెల్ఫీ తీసుకోవడం కూడా నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. బంగ్లాదేశ్‌, అమెరికాల మధ్య సత్సంబంధాల కోసం భారత్‌ చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇక బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా చాలాసార్లు అమెరికాలో పర్యటించినా, అధ్యక్షుడు బైడెన్‌ను కలుసుకోలేక పోయిందని, కానీ భారత్‌లో కలుసుకునే అవకాశం దక్కిందని బంగ్లాదేశ్‌కు చెందిన ఓ జర్నలిస్ట్‌ ట్వీట్ చేయడం చర్చగా మారింది. మొత్తం జీ20 సమ్మిట్‌కు బంగ్లాదేశ్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం ద్వారా బంగ్లాకు భారత్‌ ఎంత మద్ధతుగా ఉంటుందో చెప్పినట్లైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…

ఈడెన్ వివాదంపై నోరు విప్పిన హర్ష భోగ్లే! చిన్న కథ కాదురా సామీ!
ఈడెన్ వివాదంపై నోరు విప్పిన హర్ష భోగ్లే! చిన్న కథ కాదురా సామీ!
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు.. ఒకరు మృతి
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు.. ఒకరు మృతి
ఈ పండ్లు ఫ్రిడ్జ్‌లో పెడితే పోషకాలే విషమవుతాయి..
ఈ పండ్లు ఫ్రిడ్జ్‌లో పెడితే పోషకాలే విషమవుతాయి..
ఈ సీజన్ గంగార్పణం చేసిన ధోని!” చెన్నైపై రాయుడు షాకింగ్ కామెంట్స్
ఈ సీజన్ గంగార్పణం చేసిన ధోని!” చెన్నైపై రాయుడు షాకింగ్ కామెంట్స్
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
LICలో అద్భుతమైన పథకం.. రోజుకు రూ.50 జమ చేస్తే రూ.6 లక్షల బెనిఫిట్
LICలో అద్భుతమైన పథకం.. రోజుకు రూ.50 జమ చేస్తే రూ.6 లక్షల బెనిఫిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
ఖాళీ కడుపుతో వాకింగ్ మంచిదేనా..?
ఖాళీ కడుపుతో వాకింగ్ మంచిదేనా..?
రాత్రిపూట ఇలా తయారు చేసిన పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
రాత్రిపూట ఇలా తయారు చేసిన పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు..
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో వచ్చే 3 రోజులు వర్షాలు..