AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మీరే కాదు.. మేమూ ఆడగలం టైర్‌ ఆట..! తగ్గేదేలే అంటున్న వీధి కుక్క.. వీడియో చూస్తే వావ్‌ అనాల్సిందే..

వీడియో చూసిన వెంటనే చాలా మంది నెటిజన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. తమ చిన్నతనంలో ఇలాంటి టైర్ ఆటలు ఎక్కువగా ఆడుకునే వాళ్లమని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు పాపం ఆ కుక్క అంత బరువైన టైర్ ని ఎలా మోస్తుందోనని ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు కుక్క చేసే అల్లరి బాగా ..

Viral Video: మీరే కాదు.. మేమూ ఆడగలం టైర్‌ ఆట..! తగ్గేదేలే అంటున్న వీధి కుక్క.. వీడియో చూస్తే వావ్‌ అనాల్సిందే..
Dog Seen Playing With Tire
Jyothi Gadda
|

Updated on: Sep 11, 2023 | 4:45 PM

Share

పెంపుడు కుక్కలంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది ప్రజలు తమ ఇళ్లలో కుక్కలను పెంచుకుంటున్నారు. ఇక, కొందరు వీధి కుక్కలను కూడా ప్రేమిస్తుంటారు. వాటికి కావాల్సిన తిండి పెడుతూ.. ఆలనా పాలనా చూస్తుంటారు. అయితే, పెంపుడు కుక్కలు తమ యజమానులతో చేసే సందడి అప్పుడు సోషల్ మీడియా వీడియోల ద్వారా మనం చూస్తుంటాం.. అలాగే, వీధుల్లో ఉండే కుక్కలు కూడా సరదాగా గడుపుతుంటాయి. వీధి కుక్కలు తరచూ కోతులు, మేకలు, పశువులతో స్నేహం చేస్తున్న వీడియోలు గతంలో అనేకం చూశాం. అలాంటి వీడియోలను నెటిజన్లు సైతం ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటిదే ఈ వీడియో కూడా ఇక్కడో వీధి కుక్క సరదా ఆటలు ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోలో కుక్క చాలా ఆనందంగా టైర్‌తో ఆడుకుంటూ కనిపించింది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోని ‘బూటెంగిబిడెన్’ అనే హ్యాండిల్‌తో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్‌ చేశారు. ఆ తర్వాత ఇది వేగంగా వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియో1.3 మిలియన్లకు పైగా వీక్షణలను పొందింది. న్యూఢిల్లీ, JNN. సోషల్ మీడియాలో కనిపించే జంతువులు, పక్షుల వీడియోలు తరచుగా ఆశ్చర్యపరుస్తాయి. అలాంటిదే ఇక్కడ కూడా ఈ వీడియోలో ఓ కుక్క రోడ్డుపై టైర్‌తో ఆనందంగా ఆడుకుంటూ కనిపించింది. వీడియో ప్రారంభంలో బ్రౌన్ కలర్ కుక్క టైర్‌తో పరిగెడుతూ, గెంతుతూ ఆడుకుంటోంది. టైర్ ను తన మెడపై వేసుకుని ఎత్తైన రోడ్డు పై వరకు వెళ్తుంది…అక్కడ టైర్ ను కిందకు తోసి మళీ దాని ముందు కిందకు పరుగులు పెడుతూ సందడి చేస్తుంది. మరికాసేపు కుక్క తన తలతో టైర్ ను కంట్రోల్ చేస్తూ డ్రైవ్ చేస్తుంది..

అదే సమయంలో ఈ వీడియోను 132 వేల మందికి పైగా లైక్ చేసారు. దీంతో పాటు 19 వేల మందికి పైగా ఈ వీడియోను రీట్వీట్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. సోషల్ మీడియా యూజర్లు కూడా ఈ వీడియోపై విస్తృతంగా కామెంట్ చేస్తున్నారు. వీడియో చూసిన వెంటనే చాలా మంది నెటిజన్లు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. తమ చిన్నతనంలో ఇలాంటి టైర్ ఆటలు ఎక్కువగా ఆడుకునే వాళ్లమని కొందరు కామెంట్ చేశారు. మరికొందరు పాపం ఆ కుక్క అంత బరువైన టైర్ ని ఎలా మోస్తుందోనని ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు కుక్క చేసే అల్లరి బాగా నచ్చుతుంది అంటూ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..