AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ కార్యదర్శి

రాజకీయాల్లో ఉన్నవారు నోటికేదొస్తే అది మాట్లాడకూడదు. లేకపోతే అనుపమ్‌ హజ్రాలా అవుతుంది పరిస్థితి… పశ్చిమ బెంగాల్‌ నుంచి నిన్నగాక మొన్న బీజేపీ నూతన జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు అనుపమ్‌ హజ్రా.. ఎన్నికైన ఉత్సాహంతో కాబోలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. పోలీసులు కేసు పెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు.. తనకు కరోనా వైరస్‌ సోకితే బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ ఓ చెత్త కామెంట్‌ చేశారు అనుపమ్‌ హజ్రా.. ఒక […]

మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ కార్యదర్శి
Balu
|

Updated on: Sep 28, 2020 | 4:23 PM

Share

రాజకీయాల్లో ఉన్నవారు నోటికేదొస్తే అది మాట్లాడకూడదు. లేకపోతే అనుపమ్‌ హజ్రాలా అవుతుంది పరిస్థితి… పశ్చిమ బెంగాల్‌ నుంచి నిన్నగాక మొన్న బీజేపీ నూతన జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు అనుపమ్‌ హజ్రా.. ఎన్నికైన ఉత్సాహంతో కాబోలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. పోలీసులు కేసు పెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు.. తనకు కరోనా వైరస్‌ సోకితే బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ ఓ చెత్త కామెంట్‌ చేశారు అనుపమ్‌ హజ్రా.. ఒక ముఖ్యమంత్రిపై అందులోనూ ఓ మహిళపై ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు..? తృణమూల్‌ కాంగ్రెస్‌ రెఫ్యూజీ సెల్‌ అనుపమ్‌పై డార్జిలింగ్‌ జిల్లాలోని సిలిగురి పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్‌ చేసింది.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుకు దిగారు.. కరోనా కేసుల విషయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తున్నదన్నది బీజేపీ ఆరోపణ. ఈ సందర్భంలోనే అనుపమ్‌ హజ్రా మాట్లాడుతూ, ‘నాకు కూడా ఏదో ఒక టైమ్‌లో కరోనా వైరస్‌ సోకుతుంది.. అప్పుడు నేను నేరుగా వెళ్లి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటాను.. అప్పుడు కానీ ఆమెకు ప్రజలు పడుతున్న కష్టమేమిటో తెలిసిరాదు.. ప్రియమైనవారిని కోల్పోయినవారి ఆవేదన ఆమెకు అర్థం కాదు’ అని వ్యాఖ్యానించారు.. ఇంత డర్జీ కామెంట్‌పై బెంగాల్‌లోని బీజేపీ నాయకులు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు.. అయితే బీజేపీకి కొత్తగా ఎన్నికైన ఉపాధ్యక్షుడు ముకుల్‌రాయ్‌ మాత్రం బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని అనుపమ్‌ హజ్రాను ఉద్దేశిస్తూ అన్నారు..

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా