పంజాబ్ తరువాత ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తాం..ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..

ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలకు తాము ఉచితంగా విద్యుత్ ఇస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మా ఢిల్లీలో మాకు సొంత విద్యుత్ ప్లాంట్లు లేకున్నా పొరుగు రాష్ట్రాలనుంచి కరెంట్ ను కొనుగోలు చేస్తున్నామని, అయినా ఇక్కడి ప్రజలకు 200 యూనిట్లవరకు ఫ్రీగా పవర్ ఇస్తున్నామని...

పంజాబ్ తరువాత ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తాం..ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..
Centre Blocks Delhi's Ration Home Delivery Scheme,delhi Ration Home Delivery,cm Aravind Kejriwal,aravind Kejriwal,delhi,centre Blocks Delhi,

ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలకు తాము ఉచితంగా విద్యుత్ ఇస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మా ఢిల్లీలో మాకు సొంత విద్యుత్ ప్లాంట్లు లేకున్నా పొరుగు రాష్ట్రాలనుంచి కరెంట్ ను కొనుగోలు చేస్తున్నామని, అయినా ఇక్కడి ప్రజలకు 200 యూనిట్లవరకు ఫ్రీగా పవర్ ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ ని రేపు విజిట్ చేస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. మీ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇటీవల పంజాబ్ రాష్ట్రాన్ని సందర్శించిన కేజ్రీవాల్..తాము ఇక్కడ అధికారంలోకి వచ్చిన పక్షంలో 300 యూనిట్ల వరకు విద్యుత్ ని ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ రాష్ట్ర శాసన సభకు వచ్జే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఉత్తరాఖండ్ అసెంబ్లీకి కూడా వచ్చే సంవత్సరం ఎలెక్షన్స్ జరగాల్సి ఉంది.ఈ కారణం వల్లే ఈ రాష్ట్రం మీద కూడా కేజ్రీవాల్ ఫోకస్ పెట్టారు.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గత ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ ను విజిట్ చేసి.. ఈ రాష్ట్రంలోనూ కేజ్రీవాల్ ప్రభుత్వం అనే పేరిట ప్రత్యేక ప్రచారోద్యమాన్ని చేపట్టారు. సుమారు 21 ఏళ్ళ క్రితం ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉంటూ వచ్చాయి. కాగా-తమ రాష్ట్రంలో ప్రతి నెలా ప్రజలకు 100 యూనిట్ల వరకు విద్యుత్ ని ఉచితంగా ఇవ్వాలన్న ప్రతిపాదన ఉందని ఉత్తరాఖండ్ విద్యుత్ శాఖ మంత్రి హరక్ సింగ్ రావత్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా రంగంలోకి దిగారు. తాము ఇక్కడ అధికారంలోకి వస్తే ఇంతకన్నా ఎక్కువ యూనిట్ల పవర్ ను ఫ్రీగా ఇస్తామని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి  : మాస్క్ లేదంటే బాదుతున్న బుడ్డోడు..! పట్టించుకోని పర్యాటకులు..వైరల్ అవుతున్న చిన్నారి వీడియో :Little Boy In Dharamshala Video.

 Poisonous Snakes dowry : వింత ఆచారం..వరకట్నంగా 21 విష సర్పాలు! కూతురి పెళ్లి చేస్తే మామగారుఇవ్వాలంట..వైరల్ వీడియో.

 Shivaji Raja New Look : అయ్యో.. శివాజీ రాజాకు ఏమైంది..?హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శివాజీరాజా తనయుడు..(వీడియో).

 మందేసిన ఎలుకలు 12 సీసాలు ఖాళీ..!మందుబాబులు జాగ్రత్త పోటీకు రెడీగా..వైరల్ అవుతున్న వీడియో : Rats Drunk video.

Click on your DTH Provider to Add TV9 Telugu