Cobra: ఇంట్లోనే తిష్ట వేసిన కోబ్రా, 26 పిల్లలు.. చూసి హడలిపోయిన కుటుంబసభ్యులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Cobra and 26 hatchlings rescued: అటవీ ప్రాంతాల్లో అన్ని రకాల జీవులు స్వేచ్ఛగా నివసిస్తుంటాయి. క్రూర మృగల నుంచి విష సర్ఫాల వరకూ అన్ని తమ తమ నివాస స్థావరాలను

Cobra and 26 hatchlings rescued: అటవీ ప్రాంతాల్లో అన్ని రకాల జీవులు స్వేచ్ఛగా నివసిస్తుంటాయి. క్రూర మృగల నుంచి విష సర్ఫాల వరకూ అన్ని తమ తమ నివాస స్థావరాలను ఏర్పరుచుకుంటాయి. ఇలాంటి సందర్భంలోనే.. ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందోగానీ ఓ ఇంట్లో ఓ నాగుపాము స్వేచ్ఛగా నివాస స్థావరాన్ని ఏర్పరుచుకుంది. ఆ ఇంట్లోనే గుడ్లు పెట్టి పిల్లలను కూడా చేసింది. అది ఒకటి రెండు కాదు.. ఏకంగా 26 పిల్లలను చేసింది. అయినా కానీ ఆ ఇంట్లో వారికి పాము కంటపడలేదు. ఎవరికీ ఎలాంటి హాని కూడా తలపెట్టలేదు.
ఇన్నాళ్లూ గుట్టుచప్పుడు కాకుండా ఉన్న పాము శుక్రవారం.. ఆ ఇంటి యజమాని కంట పడింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులందరూ భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఈ షాకింగ్ సంఘటన ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి యజమాని ఫిర్యాదు తర్వాత అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది ఆ తాచు పామును బంధించారు. ఆ పాముతోపాటు మొత్తం 26 పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించి అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు.
Mother Cobra and 26 hatchlings rescued from a house in Odisha’s Kalahandi district
“All the 26 hatchlings with mother Cobra have been released to the safe and natural habitat,” says Birendra Kumar Sahu, Snake Rescuer, Kalahandi Forest Department pic.twitter.com/qzLRShlDks
— ANI (@ANI) July 10, 2021
అనంతరం తల్లి పాముతోపాటు 26 పిల్లలను పట్టుకొని ఓ సంచిలో బంధించారు. ఆ తర్వాత సమీప అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు కలహండి అటవీ శాఖ స్నేక్ క్యాచర్ బీరేంద్ర కుమార్ సాహు వెల్లడించారు. పాము ఎవరికి హాని తలపెట్టలేదని అధికారులు వెల్లడించారు.
Also Read:
