Visakha Agency: ప్రకృతి సోయగాలతో పులకిస్తున్న విశాఖ మన్యం.. కొండలపై పాల సముద్రాన్ని తలపించేలా.. Watch Video
Visakhapatnam Agency Area Wonderful Video: విశాఖపట్నం అనగానే మనందరికీ.. మధురానుభూతి కలుగుతుంది. ఓ వైపు సముద్రం.. మరోవైపు కొండలు.. చుట్టూ అటవీ ప్రాంతం..
Visakhapatnam Agency Area Wonderful Video: విశాఖపట్నం అనగానే మనందరికీ.. మధురానుభూతి కలుగుతుంది. ఓ వైపు సముద్రం.. మరోవైపు కొండలు.. చుట్టూ అటవీ ప్రాంతం.. ఇవన్నీ మనసుకు ఆహ్లాదపరుస్తుంటాయి. ఏ కాలమైనా విశాఖ మన్యంలో ప్రకృతి పరవశిస్తూ.. సందర్శకుల మనసును హత్తుకుంటుంది. కొండలపై మేఘాలు తడుముతున్నట్లు ఆహ్లాదపరుస్తుంటాయి. తాజాగా.. వర్షాకాలం ప్రారంభం కావడంతో విశాఖ మన్యానికి ప్రకృతి సోయగం ముద్దాడుతోంది. వర్షాలు కురుస్తుండడంతో కొండలపై మేఘాల ముసుగు కమ్ముకుంది. మన్యంలోని పాడేరు మండలం వంజంగి కొండపై పాలసముద్రాన్ని తలపించేలా మేఘాలు పరుచుకున్నాయి. ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో మొదలై ఫిబ్రవరి వరకు ఉండే ఈ వాతావరణం ఏడాది జూలైలోనే ప్రారంభమైంది. ఓ వైపు పాలసముద్రాన్ని తలపించే మేఘాలు.. మరోవైపు చుట్టూ కమ్ముకున్న మంచు.. చూపరులను ఆహ్లాదపరుస్తున్నాయి.
వీడియో..
ఈ ఏడాది వాతావరణం మార్పుల ప్రభావంతో మన్యంలో తొందరగానే ప్రకృతి సోయాగాల దృశ్యం కనువిందు చేస్తోంది. ఎత్తైన కొండల మధ్యలో దట్టమైన శ్వేతవర్ణం మేఘాలను చూసి ఈ ప్రాంతానికి వచ్చే వారు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కాగా.. కరోనా ప్రభావంతో టూరిస్టులు పెద్దగా లేకపోయినప్పటికీ.. స్థానికంగా ఉండే యువత కొండపైకి వెళ్లి ఎంజాయ్ చేస్తూ.. ప్రకృతి సోయగాలను మొబైల్ ఫోన్లల్లో చిత్రీకరించుకుంటున్నారు.
Also Read: