Noise Pollution: శబ్ధ కాలుష్యంపై అధికారుల కొరఢా.. వాటిని ఉపయోగిస్తే లక్ష రూపాయల జరిమానా..!

Noise Pollution: దేశంలో శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది.ప్రపంచంలో కాలుష్య రాజధానుల్లో మన దేశ రాజధాని ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. ఇక శబ్ధ కాలుష్యపై ఢిల్లీ పొల్యూషన్‌ కంట్రోల్‌.

Noise Pollution: శబ్ధ కాలుష్యంపై అధికారుల కొరఢా.. వాటిని ఉపయోగిస్తే లక్ష రూపాయల జరిమానా..!
Noise Pollution
Follow us

| Edited By: Subhash Goud

Updated on: Jul 10, 2021 | 1:35 PM

Noise Pollution: దేశంలో శబ్ద కాలుష్యం పెరిగిపోతోంది.ప్రపంచంలో కాలుష్య రాజధానుల్లో మన దేశ రాజధాని ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. ఇక శబ్ధ కాలుష్యపై ఢిల్లీ పొల్యూషన్‌ కంట్రోల్‌ కమిటీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. శబ్ధ కాలుష్యంపై భారీగా జరిమానాలు పెంచుతూ ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా లౌడ్ స్పీకర్లు, మైకులు వినియోగిస్తూ రూ. 10,000 జరిమానా విధించనుంది. అలాగే 1000 కేవీఏ సామర్థ్యానికి మించిన డీజిల్ జనరేటర్లు వినియోగిస్తే లక్ష రూపాయల వరకు పెనాల్టీ విధించనుంది. ఇక నిర్మాణ రంగంలో భారీ శబ్దాలు చేసే యంత్రాలను వినియోగిస్తే కూడా జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి యంత్రాలకు రూ. 50వేలు జరిమానా విధించనున్నారు.

కాలుష్య జాబితాలో దేశ రాజధాని..

కాగా, కాలుష్య దేశాల్లో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది. అంతేకాదు.. ప్రపంచంలో కాలుష్య రాజధానుల్లో మన దేశ రాజధాని ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యంత కాలుష్య రాజధానుల్లో ఢిల్లీ తొలి స్థానంలో నిలువడం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యంతో పాటు శబ్ధ కాలుష్యం కూడా అధికంగా మారింది. ఈ కాలుష్యాల వల్ల జనాలకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక వాహనాల నుంచి వెలువడే కాలుష్యం వల్ల జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతుండటంతో ఈ మధ్య కాలంలో వాహనాలకు సరి-బేసి విధానాన్ని విధించారు. సరి-బేసి సంఖ్యతో ఉన్న వాహనాలు రోడ్లపై తిరిగేందుకు అనుమతులు ఇచ్చారు. కాలుష్య నివారణకు అధికారుల చర్యల వల్ల ఢిల్లీ నగరం కొంత మెరుగు పడింది. ఇక శబ్ధ కాలుష్యం వల్ల ఇబ్బందులు తలెత్తడంతో గతంలో విధించిన జరిమానాను పెంచేసింది ఢిల్లీ పొల్యూషన్‌ కంట్రోల్‌ కమిటీ. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరఢా ఝులిపిస్తోంది. భారీ జరిమానాతో పాటు అందుకు సంబంధించిన పరికరాలను సైతం స్వాధీనం చేసుకోనున్నారు. ఇక గతంలో ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన 30 నగరాల జాబితా విడుదల చేయగా.. వాటిలో 22 నగరాలు భారత్‌లోనే ఉండటం గమనార్హం.

ప్రపంచ వ్యాప్తంగా 30 నగరాలు అ‍త్యంత కలుషితమైనవిగా గుర్తించారు. చైనాలోని జింజియాంగ్‌.. ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా నిలిచింది. ఆ తర్వాత 9 నగరాలు భారత్‌కు చెందినవే కావడం గమనార్హం. ఈ జాబితాలో రెండో స్థానంలో గజియాబాద్‌, మూడో స్థానంలో బులంద్‌షహర్‌ నిలిచాయి.  ప్రపంచంలో అత్యంత కలుషిత రాజధాని నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాల ప్రకారం.. గాలిలో పీఎం 2.5 స్థాయి 10 మైక్రో గ్రాములు మించకూడదు. భారత ప్రమాణాల ప్రకారం 40 మైక్రో గ్రాములు వరకు ఉండవచ్చు. కానీ, ఢిల్లీలో కాలుష్య తీవ్రత డబ్ల్యూహెచ్‌ఓ నిర్దేశించిన ప్రమాదకర స్థాయి కంటే 14 రెట్లు ఎక్కువగా నమోదవుతోందని గతంలో గుర్తించి చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ ఆంక్షల కారణంగా గతేడాది ఢిల్లీ ప్రజలు కొంతకాలం స్వచ్ఛమైన గాలి పీల్చినప్పటికీ.. చలి కాలం వచ్చే సరికి పరిస్థితి మళ్లీ ప్రమాదకరంగా మారింది. తర్వాత మరిన్ని చర్యలతో కొంత స్వచ్ఛమైన గాలి ఏర్పడే స్థాయికి చేరింది.

ఇవీ కూడా చదవండి:

Petrol Diesel Price Today: మండిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. లబోదిబోమంటున్న వాహనదారులు

Zomato: మీరు జోమాటో యాప్‌ వాడుతున్నారా..? మీకో బంపర్‌ ఆఫర్‌.. రూ.3 లక్షలు గెలుచుకునే అవకాశం.. ఎలాగంటే..!