Meghalaya Honeymoon Case: భార్య రాసిన మరణశాసనం.. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ ఇప్పటివరకు వినలే.. కనలే..!
పతీ పత్నీ.. ఔర్ వో. దీన్నే ఇంకోరకంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య అతడు. ఇండోర్‌కు చెందిన దంపతులు హనీమూన్‌కు వెళితే, భర్త శవమై తేలాడు. అయితే అతడి భార్యే హంతకురాలు. మూడు రాష్ట్రాల పోలీసులను పరుగులు పెట్టించిన ఈ మర్డర్ స్కెచ్‌లో ఏయే అంశాలు కీలకంగా మారాయో చూద్దాం...

సోనమ్ – రాజా రఘువంశీ.. మధ్యప్రదేశ్ ఇండోర్‌కి చెందిన వీళ్లిద్దరూ.. మే 11న ఇరు కుటుంబాల సమక్షంలో ఒక్కటయ్యారు. బంధు మిత్రుల ఈశీర్వాదం మధ్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మూడుముళ్ల తంతు ముగిశాక.. మే 20న మేఘాలయలోని షిల్లాంగ్ వెళ్లారు. మే 22న ఓ స్కూటిని రెంట్‌కి తీసుకుని మౌలాఖియాత్ గ్రామానికి వెళ్లారు. స్కూటీ పార్క్ చేసి ప్రసిద్దిగాంచిన లివింగ్ రూట్ వంతెన చూసేందుకు వెళ్లారు. ఆ తర్వాత వీళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేకుండాపోయింది. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలే పర్యాటక ప్రాంతం ఏమాత్రం అలసత్వం వహించినా చాలా ఇబ్బందులు వస్తాయని భావించిన మేఘాలయ ప్రభుత్వం.. దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. దీంతో పోలీసులు హెలికాప్టర్ల సాయంతో కొండ ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. జూన్ 2న రాజా రఘువంశీ శవమై కనిపించాడు. అది కూడా లోయ ప్రాంతంలో. స్కూటీ ఉన్న ప్రాంతానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో రఘువంశీ డెడ్‌బాడీ పడి ఉంది. అతని శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. భార్య ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అందరిలో ఒకటే అనుమానం. గుర్తుతెలియని వ్యక్తులు నగదు, నగల కోసం సోనమ్‌ను ఏమైనా చేశారేమోనని. కానీ ఆ.. అనుమానాలు పటాపంచలు చేస్తూ.. నివ్వెరపోయే నిజాలను బయటపెట్టారు మేఘాలయ పోలీసులు. భర్త రాజా రఘువంశీని చంపింది భార్య సోనమేనని తేల్చేశారు. రఘువంశీ కుటుంబానిది ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్. వాళ్ల...