Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందే భారత్‌లో బర్త్‌ డే వేడుకలు..! ట్రైన్‌లో ఉన్న వాళ్లను చంపాలనుకున్నారా అంటూ మండిపడ్డ నెటిజన్లు

వారణాసి దంపతులు కశ్మీర్‌కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తమ కొడుకు బర్త్‌డే వేడుకలు చేసుకున్నారు. కేక్‌పై క్యాండిల్స్ వెలిగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రైలులో క్యాండిల్స్ వెలిగించడం ప్రమాదకరం అని, భద్రతా నిబంధనల ఉల్లంఘన అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దంపతుల ఆనంద వేడుకలు వివాదానికి దారితీశాయి.

వందే భారత్‌లో బర్త్‌ డే వేడుకలు..! ట్రైన్‌లో ఉన్న వాళ్లను చంపాలనుకున్నారా అంటూ మండిపడ్డ నెటిజన్లు
Birthday In Vande Bharat
Follow us
SN Pasha

|

Updated on: Jun 09, 2025 | 7:06 PM

కశ్మీర్‌లోని మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వారణాసి దంపతులు తమ కుమారుడు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వేడుకలు సంతోషంగా జరిగినప్పుటికీ.. సోషల్‌ మీడియాలో మాత్రం ఆ బర్త్‌డే వేడుకలపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. వాళ్లు సంతోషంగా కొడుకు బర్త్‌డే చేసుకుంటే.. ఏమైంది అని అనుకోవచ్చు. వాళ్ల కోపానికి ఒక కారణం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జూన్ 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన అంజి ఖాడ్ వంతెన దాటుతున్న రైలులో రాకేష్, నేహా జైస్వాల్ తమ కుమారుడు మోక్ష్ ఆరవ పుట్టిన రోజును కేక్ కట్ చేసి జరుపుకున్నారు.

వీడియోలో నేహా జైస్వాల్ కుటుంబం ఆ సందర్భాన్ని జరుపుకుంటుండగా కేక్ మీద కొవ్వొత్తులను వెలిగిస్తూ కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది వీక్షకులు ఈ చర్యను బాధ్యతారహితంగా, ప్రజా రవాణా వ్యవస్థలో అనుచితంగా ఉందని విమర్శించారు. “రైలు మీ పార్టీ హాల్ కాదు. లోపల కొవ్వొత్తులను వెలిగించడం సురక్షితం కాదు, ప్రాథమిక పౌర జ్ఞానం లేకపోవడాన్ని కూడా చూపిస్తుంది” అని ఓ నెటిజన్‌ విమర్శించారు. మరికొందరు భద్రతా ఉల్లంఘనల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.

“రైళ్ల లోపల అగ్గిపుల్ల వెలిగించడం నిషేధించబడిందని నేను అనుకున్నాను” అని రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌లను ట్యాగ్ చేస్తూ కామెంట్‌ చేశారు. “ఇతర ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసినందుకు మీరు అలాంటి ప్రయాణీకులను శిక్షించాలి” అని మరొక నెటిజన్‌ కామెంట్‌ చేశారు. అయితే ఈ బర్త్‌డే వేడుకలపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేకపోయినప్పటికీ.. బర్త్‌డే సందర్భంగా కేక్‌పై క్యాండిల్‌ వెలిగించడం విమర్శలకు కారణం అవుతోంది. క్యాండిల్‌ వెలింగించే క్రమంలో ట్రైన్‌లో అగ్ని ప్రమాదం జరిగితే పెను ప్రమాదం సంభవించి ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి