హైదరాబాద్‌లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ విగ్రహం ఏర్పాటు!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ విగ్రహం హైదరాబాద్ (పాకిస్థాన్)లోని నియాజ్ స్టేడియంలో ఏర్పాటు చేయబడింది. అయితే, విగ్రహం రూపం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, నెటిజన్లు దీన్ని ట్రోల్ చేస్తున్నారు. అక్రమ్ బౌలింగ్ యాక్షన్, సిల్వెస్టర్ స్టాలోన్‌తో పోలిక వల్ల ఈ విమర్శలు వస్తున్నాయి.

ఇటీవల, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని నియాజ్ స్టేడియంలో ఏర్పాటు చేశారు. అయితే అది మన హైదరాబాద్‌లో కాదు.. పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. పాకిస్థాన్ క్రికెట్‌కు ఆయన చేసిన సేవలను గౌరవిస్తూ.. ఈ విధంగా విగ్రహం ఏర్పాటు చేసిన ఆయనను సత్కరించారు. అయితే.. ఆ విగ్రహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ విగ్రహాన్ని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అక్రమ్ బౌలింగ్ యాక్షన్‌తో ఉన్న విగ్రహంపై జోకులు పేలుతున్నాయి. ఆ విగ్రహం 1992 ప్రపంచ కప్ జెర్సీలో ఉంది. అయితే, విగ్రహం ముఖం ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్‌తో కొంత పోలికను కలిగి ఉంది. దీంతో అభిమానులు ఆ విగ్రహం ఫొటోలు పోస్ట్ చేస్తూ తెగ ఆడేసుకుంటున్నారు.
ఇక వసీం అక్రమ్ గురించి చెప్పాలంటే.. ఈ దిగ్గజ పేసర్ 1984 నుంచి 2003 మధ్య పాకిస్తాన్ తరపున 104 టెస్టులు, 256 వన్డేలు ఆడాడు. టెస్ట్‌లలో అతను మొత్తం 414 వికెట్లు పడగొట్టగా, వన్డేలలో, అతను 502 వికెట్లు సాధించాడు. 2003 ప్రపంచ కప్ నుండి పాకిస్తాన్ నిష్క్రమించిన తర్వాత అతను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ తర్వాత అక్రమ్ కోచింగ్ వైపు అడుగులేశాడు. 2010 నుండి 2016 మధ్య IPLలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌కు కూడా కోచ్‌గా పనిచేశాడు.
Wasim Akram’s statue at Niaz Stadium Hyderabad pic.twitter.com/n4VOBGsYT0
— PSL Memes (@PSLMemesWalay) June 5, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..