AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగోసారి పెళ్లి చేసుకునేందుకు మూడో భర్తను హత్య చేసిన భార్య.. అసలేం జరిగిందంటే.. ?

భార్యభర్తల మధ్య గొడవలు రావడం సహజమే. కానీ మధ్యకాలంలో ఆ గొడవలు, హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. క్షణికావేశంలో భార్యను భర్త హత్య చేయడం.. లేదా భర్తను భార్య హత్య చేయడం లాంటి దారుణంలో దేశంలో ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి దారుణమైన ఘటనే బీహార్‌లోని పట్నాలో జరిగింది. ఓ యువతి నాలుగోసారి వివాహం చేసుకునేందుకు మూడో భర్తను హత్య చేయడం కలకలం రేపుతోంది.

నాలుగోసారి పెళ్లి చేసుకునేందుకు మూడో భర్తను హత్య చేసిన భార్య.. అసలేం జరిగిందంటే.. ?
Death
Aravind B
|

Updated on: Sep 11, 2023 | 10:58 AM

Share

భార్యభర్తల మధ్య గొడవలు రావడం సహజమే. కానీ మధ్యకాలంలో ఆ గొడవలు, హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. క్షణికావేశంలో భార్యను భర్త హత్య చేయడం.. లేదా భర్తను భార్య హత్య చేయడం లాంటి దారుణంలో దేశంలో ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి దారుణమైన ఘటనే బీహార్‌లోని పట్నాలో జరిగింది. ఓ యువతి నాలుగోసారి వివాహం చేసుకునేందుకు మూడో భర్తను హత్య చేయడం కలకలం రేపుతోంది. ఇంతకు అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదలాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే అస్మెరీ ఖాతూన్ ఉరఫ్ మంజూ దేవికి గతంలో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె రెండోసారి పెళ్లి చేసుకుంది. మళ్లీ కొన్ని కారణాల వల్ల సుభాష్ అనే మరో వ్యక్తిని రెండేళ్ల క్రితం వివాహం చేసుకుంది. అయితే ఇటీవల సుభాష్‌కు తన భార్యలో మార్పు కనిపించింది.

ఆమె తీరు నచ్చకపోవడంతో నిలదీశాడు. దీంతో సుభాష్ భార్య, అత్తమామలు కలిసి అతడి గొంతు నొక్కి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక మృతుడు సుభాష్ సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం చూసుకుంటే.. తన వదిన అస్మెరీ ఖాతూన్ ప్రస్తుతం వేరే వ్యక్తితో సంబంధం కలిగి ఉందని.. మళ్లీ నాలుగోసారి అతడ్ని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు వివరించారు. ఇక మరో విషయం ఏంటంటే మృతుడు సుభాష్ మద్యానికి బానిస అని పోలీసులు తెలిపారు. తన భార్యతో తరచూగా ఏదో ఒక విషయంపై గొడవ పడుతూనే ఉండేవాడని తెలిపారు. ఈ కారణాల వల్లే వారివద్ద జరిగిన గొడవలు హత్యకు దారితీసినట్లు పేర్కొన్నారు. గతంలో అస్మెరికి రెండుసార్లు వివాహాలు జరిగిన అనంతంరం ఆమె వారిని వదిసిందని ఆ తర్వాత మూడోసారి సుభాష్‌ను పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు అస్మెరీకి అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు.

ఇక సుభాష్ హత్య అనంతరం అతని కుటుంబ సభ్యుల్లో అనుమానాలు వచ్చాయి. అస్మెరీ, అత్తమామలు కలిసి ఈ హత్య చేసినట్లు వారు ఆరోపించారు. అయితే సుభాష్ సోదరుడు బ్రజేష్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. తన సోదరుణి భార్య మరో వ్యక్తితో సంబంధంలో ఉందని చెప్పారు. అయితే ఈ సంగతి తన సోదరుడు సుభాష్‌కు తెలిసిందని.. అందుకోసమే అతను ఆమెను నిలదీశాడని చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని.. ఈ నేపథ్యంలోనే అస్మేరీ తన తల్లిదండ్రులతో కలిసి సుభాష్ గొంతు నొక్కి హత్య చేసినట్లు ఆరోపణలు చేశాడు. ఈ సంఘటన గురించి తెలియగానే తాము వెంటనే అక్కడికి చేరుకున్నామని ఫుల్వారీ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించినట్లు పేరొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!