Bharat: ప్రపంచంలో అనేక దేశాలు పేర్లు ఎలా మార్చుకున్నాయో తెలుసా..! పూర్తి వివరాలు..

Bharat: ప్రపంచంలో అనేక దేశాలు పేర్లు ఎలా మార్చుకున్నాయో తెలుసా..! పూర్తి వివరాలు..

Anil kumar poka

|

Updated on: Sep 11, 2023 | 9:51 AM

ప్రస్తుతం దేశమంతా ఒకటే టాపిక్.. టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. ఇండియా పేరును శాశ్వతంగా భారత్ అని మార్చనున్నారా అనే అంశం ప్రస్తుతం దేశాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. ఇండియాను తొలగించి భారత్ గా మార్చబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి, అది వాస్తవమేనన్న సంకేతం కనిపించింది. జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ముందు భారత్ నేమ్ ప్లేట్ కనిపించింది. జీ20 విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

ప్రస్తుతం దేశమంతా ఒకటే టాపిక్.. టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. ఇండియా పేరును శాశ్వతంగా భారత్ అని మార్చనున్నారా అనే అంశం ప్రస్తుతం దేశాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. ఇండియాను తొలగించి భారత్ గా మార్చబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి, అది వాస్తవమేనన్న సంకేతం కనిపించింది. జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ముందు భారత్ నేమ్ ప్లేట్ కనిపించింది. జీ20 విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపించిన లేఖల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండడం, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్టు కేంద్ర సర్కారు చేసిన ప్రకటన పేరు మార్పుపై పెద్ద చర్చకు దారి తీసింది. దేశంలో ఇప్పటి వరకు వివిధ నగరాల పేర్లు మార్చుతూ వచ్చిన మోదీ సర్కార్ తాజాగా దేశం పేరు కూడా మార్చే పనిలో పడిందన్నది టాపిక్ ప్రస్తుతం వైరల్ గా మారింది. గత శతాబ్ద కాలంలో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తమ పేర్లను మార్చుకున్నాయి. కొన్ని దేశాల పేర్లు స్వల్పంగా మారితే మరికొన్ని దేశాల పేర్లు అసలు అంతకుముందు పేరుతో ఏమాత్రం సంబంధం లేనంతగా మారాయి.. ప్రస్తుత శతాబ్దంలో పేరు మార్చుకున్న తొలి దేశం కామురోజ్. 2001లో దీని పేరును ‘యూనియన్ ఆఫ్ కామురోజ్’గా మార్చారు. ఆగ్నేయ ఆఫ్రికా దేశమైన ఇది మూడు దీవుల సమూహం. చరిత్ర పుటల్లో హోలాండ్ అని పిలుచుకున్న దేశమే ఇప్పుడున్న నెదర్లాండ్స్. 2020 లో హోలాండ్ దేశాన్ని నెదర్లాండ్స్ అని పేరు మార్చారు.

చెక్ రిపబ్లిక్ దేశం పేరుని చెకియా అని పేరు మార్చారు. చెక్ రిపబ్లిక్ అనేది చిన్న దేశం. చెక్ రిప్లబ్లిక్ కి నాలుగు వైపులా నాలుగు దేశాలు ఉన్నాయి. ఉత్తరాన పోలాండ్, దక్షిణాన ఆస్ట్రియా, పశ్చిమాన జర్మనీ, తూర్పున స్లోవేకియా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం పిలుచుకుంటున్న మన పొరుగు దేశమైన మయన్మార్ పేరు ఒకప్పుడు బర్మా అనే విషయం తెలిసిందే. 1989 లో బర్మాను మయన్మార్ అని పేరు మార్చడం జరిగింది. 1972 వరకు శ్రీలంకను సీలాన్ అని పిలుచుకునే వారు. ఆతర్వాత శ్రీలంక‌గా మారిపోయింది. అలాగే థాయిలాండ్ అసలు పేరు సియామ్. 1939 లో సియామ్‌‌ని థాయిలాండ్ గా పేరు మార్చారు. ఇటీవల టర్కీని సైతం మార్చేశారు. 2021 లో తుర్కియేగా నామకరణం చేశారు. కింగ్‌డమ్‌ ఆఫ్‌ స్వాజిలాండ్‌ పేరును కింగ్‌డమ్‌ ఆఫ్‌ ఈశ్వతినిగా మారుస్తున్నట్టు 2018 ఏప్రిల్‌లో ఆ దేశ రాజు ఎంస్వాతి- 3 ప్రకటించారు. స్వాజిలాండ్‌, స్విట్జర్లాండ్‌ దేశాల మధ్య ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇక 1990-91 మధ్య కాలంలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో కొత్త దేశాలు ఏర్పడ్డాయి. 2019లో రిపబ్లిక్‌ ఆఫ్‌ మాసిడోనియా పేరును రిపబ్లిక్‌ ఆఫ్‌ నార్త్‌ మాసిడోనియాగా మార్చేశారు. అయితే, తమ పౌరులను నార్త్‌ మాసిడోనియన్లు అని కాకుండా మాసిడోనియన్లు అని పిలువాలని ఆ దేశం పేర్కొన్నది. ప్రస్తుత ఇరాన్‌ను సాంప్రదాయకంగా పర్షియా అని పిలుస్తున్నారు. 1935లో పర్షియా పేరును ఇరాన్‌గా మార్చారు. రాజ్యంపరంగా ఇరాన్‌ అని పిలుస్తున్నా.. ఆహారం, కళలు, సాహిత్యంలాంటి దీర్ఘకాలిక సాంస్కృతిక ఎగుమతులను పర్షియన్‌గానే వ్యవహరిస్తున్నారు. బహ్రైన్ పేరు కూడా మారింది. అప్పటి వరకు ‘స్టేట్ ఆఫ్ బహ్రైన్’గా ఉన్నది ‘కింగ్‌డమ్ ఆఫ్ బహ్రైన్’గా మారింది. రిపబ్లిక్ ఆఫ్ బొలీవియా పేరు ‘ప్లూరినేషనల్ స్టేట్ ఆఫ్ బొలీవియా’గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..