WhatsApp Scam: బీఅలర్ట్.. +92 నుండీ ఎప్పుడైనా నెంబర్ వచ్చిందా..? అయితే, డేంజర్‌లో పడినట్లే..
Cyber Crime: ఇటీవల దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అన్ని రకాల మోసాలు చేసేశాక ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కొత్త పందాను ఎంచుకున్నారు.. వాట్సప్ కాల్ చేస్తారు..

Cyber Crime: ఇటీవల దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అన్ని రకాల మోసాలు చేసేశాక ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కొత్త పందాను ఎంచుకున్నారు.. వాట్సప్ కాల్ చేస్తారు.. ఐఫోన్ గిఫ్ట్ ల పేరుతో బాధితుల నుంచి రూ. లక్షలు కాజేస్తున్నారు స్కామర్స్. బాధితుల అత్యాశను వారి అమాయకత్వాన్ని.. క్యాష్ చేసుకుంటున్నా స్కామర్స్ నిమిషాల్లో లక్షలు దోచుకుంటున్నారు. తాజాగా, అహ్మదాబాద్ కు చెందిన ఒక వ్యక్తి+92 నుండి వచ్చిన కాల్ ట్రాప్ లో పడి ఏడు లక్షలు పోగొట్టుకున్నాడు.
ఐఫోన్లు ఆపిల్ ప్రొడక్ట్స్ ఆఫర్ల పేరుతో బాధితులను నట్టేట ముంచుతున్న బడే బాయ్ బ్యాచ్. ఆన్లైన్ ఫ్రాడ్స్‌లో ఇదో కొత్త తరహా మోసం. స్కాం చేసేందుకు +92 వర్చువల్ నంబర్ను వాడుకున్న స్కామర్స్. గూగుల్ లో +92 నంబర్ కోడ్ చూస్తే ఇది పాకిస్తాన్ కి సంబంధించిన నంబర్. కానీ సైబర్ క్రైమ్ అధికారుల దర్యాప్తులో అసలు పాకిస్తానీలకు దీనికి ఎటువంటి సంబంధం లేదని తేల్చారు. వర్చువల్ గా +92 నంబర్ను ఉపయోగించి బడే భాయ్.. చోటే భాయ్ పేరుతో లక్షలు కాజేస్తున్నాయి ముఠాలు..
అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న బడే బాయ్ చోటే బాయ్ ఉచ్చులో పడి ఏడు లక్షలు పోగొట్టుకున్నాడో బాధితుడు. మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రీ ఆపిల్ ప్రొడక్ట్స్ పేరుతో ఒక లింక్ సర్కులేట్ చేస్తున్న ముఠా. కొంతమంది అమాయకులు ఫ్రీగా ఐఫోన్ వచ్చేస్తుందని నమ్మి ఆ లింక్ క్లిక్ చేస్తున్నారు. ముఠాలోని ఒక సభ్యుడు బాధితుడిని సంప్రదించి ఐఫోన్ గెలుచుకున్నట్టుగా బిల్డప్ ఇస్తారు. ప్రాసెసింగ్ ఫ్రీ కోసం ఫోన్ పే నెంబర్ కు 3000 పంపాల్సిందిగా బాధితుడిని కోరుతారు. తరువాత రోజు డెలివరీ చార్జెస్ అంటూ మరో ఎనిమిది వేల రూపాయలు బాధితుడు నుండి వసూలు చేశారు.




ఎలాగో 70 వేల రూపాయల విలువచేసే ఐఫోన్ ఫ్రీ గా వచ్చేస్తుందనే ఆశతో 8000 కూడా చెల్లించేశాడు బాధితుడు. ఇది జరిగిన రెండు రోజులకి ఎటువంటి రెస్పాన్స్ స్కామర్ల నుండి రాకపోవడంతో అనుమానం వచ్చి తన బ్యాంక్ ఖాతా చూసుకున్నాడు. తనకి తెలియకుండానే తన బ్యాంకు నుండి 6.76 లక్షలు స్కామర్లు కొట్టేసినట్టు గ్రహించాడు. తనను సంప్రదించిన ఫోన్ నెంబర్లకు కాల్స్ చేసిన వెంటనే స్విచ్ ఆఫ్ అవ్వటంతో పోలీసులను ఆశ్రయించాడు సదరు బాధితుడు.
బడే భాయ్. కామ్ పేరుతో దేశవ్యాప్తంగా వందల కొద్ది కేసులు..
బాధితులకు వచ్చిన కాల్స్ అన్నీ కూడా +92 నుండి వచ్చినవే. తామంత దుబాయ్ నుంచి మాట్లాడుతున్నట్టు బాధితులను నమ్మేలా చేస్తారు. సైబర్ క్రైమ్ పోలీసుల వివరాల ప్రకారం బడే బాయ్ చోటే బాయ్ పేరుతో జరుగుతున్న నేరాలు అన్ని ఒకే తరహాలో ఉన్నట్టు గుర్తించారు. తాము పట్టుబడకుండా ఉండేందుకు వర్చువల్ గా +92 కోడ్ ఉపయోగించి బాధితులకు కాల్ చేస్తున్నారు.
వర్చువల్ నంబర్స్ స్కాం తో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- ఫోన్లో పర్సనల్ వివరాలు షేర్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి
- కంపెనీ నుండి కాల్ చేస్తున్నాం అని వస్తున్న కాల్స్ పై శ్రద్ధ వహించండి
- అనుమానం వచ్చిన కాల్స్ ను వెంటనే బ్లాక్ చేయండి
- స్కామర్స్ నుండి ఎటువంటి కాల్స్ రాకుండా ఉండాలంటే “do not call” రిజిస్ట్రీలో ఫోన్ నెంబర్ తో దరఖాస్తు చేసుకోండి
- ట్రూ కాలర్ ఆప్ ద్వారా పబ్లిష్ అయ్యే స్కాం కాల్స్ ను ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించవద్దు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..