Whatsapp: కేంద్రం సీరియస్.. భారత్‌కు క్షమాపణలు చెప్పిన వాట్సాప్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

భారతదేశానికి వాట్సాప్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. ఇండియా మ్యాప్ విషయంలో చేసిన తప్పుని గుర్తించి.. వెంటనే సరిదిద్దుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది వాట్సాప్.

Whatsapp: కేంద్రం సీరియస్.. భారత్‌కు క్షమాపణలు చెప్పిన వాట్సాప్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Whatsapp
Follow us

|

Updated on: Jan 01, 2023 | 10:00 PM

భారతదేశానికి వాట్సాప్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. ఇండియా మ్యాప్ విషయంలో చేసిన తప్పుని గుర్తించి.. వెంటనే సరిదిద్దుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది వాట్సాప్. తాజాగా వాట్సాప్ ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో ఇండియా మ్యాప్ తప్పుగా ఉంది. ఇది గుర్తించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దాంతో స్పందించిన వాట్సాప్.. భారత్‌కు క్షమాపణలు చెప్పింది.

భారతదేశంలో వ్యాపారం చేసే ప్రతి సంవత్స దేశానికి సంబంధించిన సరైన మ్యాప్‌ను ఉపయోగించాలని ఐటీ మంత్రి స్పష్టం చేశారు. వాట్సాప్.. ఇండియా మ్యాప్‌ను తప్పుగా ప్రచురించిందని, లోపాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు మంత్రి. ఇదే సమయంలో భారతదేశంలో వ్యాపారం చేస్తున్న సంస్థలు.. దేశంలో తమ వ్యాపారాన్ని కొనసాగించాలనుకుంటే అన్ని ప్లాట్‌ఫామ్‌లలో సరైన మ్యాప్‌లను ఉపయోగించాలని మంత్రి స్పష్టం చేశారు.

మంత్రి వార్నింగ్‌తో స్పందించి ట్విట్టర్.. తమ పొరపాటును గుర్తించి సరిచేసుకుంది. ట్విట్టర్‌లో క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసింది. ఏమరపాటుతో జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, దీనిని గుర్తించి వెంటనే అలర్ట్ చేసిన మంత్రికి ధన్యవాదాలు. ‘వెంటనే స్ట్రీమ్‌ను తీసివేశాం. ఇలా జరిగినందుకు చింతిస్తున్నాం. క్షమాపణలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి జరుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం’ అని వాట్సాప్ టిట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

కాగా, న్యూఇయర్ సందర్భంగా లైవ్ స్ట్రీమ్‌లో పోస్ట్ చేసిన వాట్సాప్ వీడియోలో భారతదేశ మ్యాప్‌లో జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి తప్పుడు మ్యాప్ ప్రజెంట్ చేశారు. దాంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన వాట్సాప్ ఆ వీడియోను తీసేసింది. గతంలో కూడా ట్విట్టర్ ఇదే రకమైన వీడియోను పోస్ట్ చేయగా.. అప్పుడు కూడా పెద్ద రచ్చ అయ్యింది. తప్పును గ్రహించిన ట్విట్టర్.. మ్యాప్‌ను తొలగించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..