Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విక్రమ్ ల్యాండర్-ప్రజ్ఞాన్ రోవర్ మేల్కొనకపోతే చంద్రయాన్ మిషన్ ఏమవుతుంది..? సర్వత్రా ఆసక్తి..

ఆగస్టు 23న భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ 23న చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్‌ ల్యాండర్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. దీంతో చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది.

విక్రమ్ ల్యాండర్-ప్రజ్ఞాన్ రోవర్ మేల్కొనకపోతే చంద్రయాన్ మిషన్ ఏమవుతుంది..? సర్వత్రా ఆసక్తి..
Chandrayaan 3
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 23, 2023 | 3:12 PM

చంద్రుని ఉపరితలంపై నిద్రావస్థలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ మేల్కొవడం కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. సూర్యుడి నుండి శక్తిని గ్రహించిన తర్వాత విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ తిరిగి తప్పక మేల్కొంటుందని ఇస్రో భావిస్తున్నప్పటికీ, ఆ రెండు మేల్కొనకపోతే చంద్రయాన్ 3 మిషన్ ఏమవుతుంది..? అనే ప్రశ్న కూడా సర్వత్రా ఉత్పన్నమవుతోంది. చంద్రుని ఉపరితలంపై సెప్టెంబర్ 22 న సూర్యుడు ఉదయిస్తాడు.. విక్రమ్‌, ప్రజ్ఞాన్ తమ పని ప్రారంభిస్తారని ఇస్త్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రుడిపై సూర్యోదయం తర్వాత ల్యాండర్, రోవర్ పని చేస్తాయని, భూమిపై నుంచి సోలార్ ప్యానెల్స్‌ను ప్రయోగించలేమని స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ అన్నారు. ఆ రెండు ప్యానెల్ నుండి శక్తిని పొందుతాయి. శక్తిని పొందిన తర్వాత అవి వాటి పనిని ప్రారంభించవచ్చునని చెప్పారు.. ప్రస్తుతం, ఆ రెండింటి నుండి ఎటువంటి సిగ్నల్ అందలేదని చెప్పారు. ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, ల్యాండర్, రోవర్ రెండూ స్వయంచాలకంగా పునరుత్పత్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

విక్రమ్, ల్యాండర్ నుండి ఇంకా ఎటువంటి సూచన ఇవ్వకపోవడంతో ఆ తర్వాత మిషన్ ఏమవుతుంది అనే ప్రశ్న సర్వ ఉత్పన్నమవుతోంది. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఆ రెండు మిషన్స్‌ చేయాల్సిన పని చేశాయి. కాబట్టి, వాటి జాడ తెలియకపోయినా పర్వాలేదన్నారు. కానీ, తెలిస్తే ఏర్పడితే బాగుంటుందన్నారు. రెండూ పునరుద్ధరించబడితే, చంద్రుని ఉపరితలంపై మరిన్ని ప్రయోగాలు నిర్వహించవచ్చునని ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఎం.అన్నాదురై అన్నారు. మరోసారి మరిన్ని ప్రయోగాలు చేయగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

సెప్టెంబర్ 2, 4 తేదీల్లో ప్రజ్ఞాన్ రోవర్-విక్రమ్ ల్యాండర్‌ను స్లీపింగ్ మోడ్‌లో ఉంచారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. సాధారణంగా చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రత -150 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పరికరాలు పని చేసే సంభావ్యత 50 శాతం మాత్రమే. సూర్యుడి నుంచి కాంతి అందుకున్న తర్వాత మేల్కొంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రయాన్ 3 మిషన్ 14 జూలై 2023న ప్రయోగించబడింది. విక్రమ్ ల్యాండర్-ప్రజ్ఞాన్ రోవర్ 22 సెప్టెంబర్ 2023న చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఆగస్టు 23న భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ 23న చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్‌ ల్యాండర్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. దీంతో చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..