AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ సారీ అమ్మా ! మీ వారు నీ బర్త్ డే కి మిస్సయ్యారు ‘ !

హూస్టన్ లో ప్రధాని మోడీ గౌరవార్థం జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్ సహా అనేకమంది యుఎస్ ఎంపీలు, గవర్నర్లు హాజరయ్యారు. వీరిలో జాన్ కార్నిన్ అనే సెనేటర్ కూడా ఉన్నారు. అయితే ఈ ఈవెంట్ కి హాజరైనందున ఆయన తన భార్య శాండీ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనలేకపోయారు. ఈ విషయం తెలిసిన మోదీ.. ఆమెకు క్షమాపణ (సారీ) చెబుతున్న వీడియో తాలూకు ట్వీట్ ను ప్రధానమంత్రి కార్యాలయం పోస్ట్ చేసింది. ‘ […]

' సారీ అమ్మా ! మీ వారు నీ బర్త్ డే కి మిస్సయ్యారు ' !
Pardhasaradhi Peri
|

Updated on: Sep 23, 2019 | 2:53 PM

Share

హూస్టన్ లో ప్రధాని మోడీ గౌరవార్థం జరిగిన హౌడీ మోడీ కార్యక్రమానికి అధ్యక్షుడు ట్రంప్ సహా అనేకమంది యుఎస్ ఎంపీలు, గవర్నర్లు హాజరయ్యారు. వీరిలో జాన్ కార్నిన్ అనే సెనేటర్ కూడా ఉన్నారు. అయితే ఈ ఈవెంట్ కి హాజరైనందున ఆయన తన భార్య శాండీ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొనలేకపోయారు. ఈ విషయం తెలిసిన మోదీ.. ఆమెకు క్షమాపణ (సారీ) చెబుతున్న వీడియో తాలూకు ట్వీట్ ను ప్రధానమంత్రి కార్యాలయం పోస్ట్ చేసింది. ‘ ఈ రోజున మీకు క్షమాపణ చెబుతున్నాను.. ఇందుకు కారణం మీ పుట్టినరోజు సెలబ్రేషన్స్ కి మీ భర్త హాజరు కాలేకపోయారు. ఆయన నా వెంటే ఉన్నారు. అందువల్ల సహజంగానే మీరు నాపట్ల అసూయతో ఉండి ఉంటారు ‘ అని ఆమెతో ఛలోక్తిగా అన్నారు. (ఆ సందర్భంలో మోడీ పక్కనే జాన్ కూడా ఉన్నారు). ‘ మీ ఇద్దరికీ బెస్ట్ విషెస్ చెబుతున్నానని, మీ భవిష్యత్తు ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలని కోరుతున్నానని ‘ మోదీ పేర్కొన్నారు. ఈ పోస్టుకు ఆరున్నరవేలకు పైగా లైక్స్, వెయ్యికి పైగా రీట్వీట్లు వచ్చిపడ్డాయి. అన్నట్టు జాన్ కార్నిన్ దంపతులది 40 ఏళ్ళ వైవాహిక జీవితం. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Follow Us
టికెట్ ఇచ్చిన 24 గంటల్లోనే గుడ్‌బై! ప్రశాంత్ కిషోర్‌‌కు షాక్..
టికెట్ ఇచ్చిన 24 గంటల్లోనే గుడ్‌బై! ప్రశాంత్ కిషోర్‌‌కు షాక్..
రూ.6,000 చెల్లింపును రూ.2,000 చొప్పున మూడుసార్లు చేస్తే ఏమవుతుంది
రూ.6,000 చెల్లింపును రూ.2,000 చొప్పున మూడుసార్లు చేస్తే ఏమవుతుంది
పై నుంచి చూస్తే అచ్చం ఇడ్లీ పిండిలాగే ఉంది.. కానీ లోపల.
పై నుంచి చూస్తే అచ్చం ఇడ్లీ పిండిలాగే ఉంది.. కానీ లోపల.
ఓటీటీలో వణికించే హారర్ థ్రిల్లర్.. పెళ్లైన ప్రతిసారీ కోడలికి అదే
ఓటీటీలో వణికించే హారర్ థ్రిల్లర్.. పెళ్లైన ప్రతిసారీ కోడలికి అదే
ధోనీ నుంచి లక్ష్మణ్ వరకు.. వీడ్కోలు మ్యాచ్ దక్కని దిగ్గజాలు వీరే
ధోనీ నుంచి లక్ష్మణ్ వరకు.. వీడ్కోలు మ్యాచ్ దక్కని దిగ్గజాలు వీరే
కిడ్నాపైన నాలుగేళ్ల పాపను రెస్క్యూ చేసిన పోలీసులు..
కిడ్నాపైన నాలుగేళ్ల పాపను రెస్క్యూ చేసిన పోలీసులు..
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నారా?సైన్స్ ఏం చెబుతోంది
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నారా?సైన్స్ ఏం చెబుతోంది
యూట్యూబ్‌లో బంగారం షో.. ఇంటికొచ్చేసరికి అంతా గోవిందా!
యూట్యూబ్‌లో బంగారం షో.. ఇంటికొచ్చేసరికి అంతా గోవిందా!
ఈ ట్రిక్స్ పాటిస్తే ప్రీమియం ఫోన్లు సగం ధరకే!
ఈ ట్రిక్స్ పాటిస్తే ప్రీమియం ఫోన్లు సగం ధరకే!
మీ నగరాన్ని నడిపించేది మేయరా? కమిషనరా?
మీ నగరాన్ని నడిపించేది మేయరా? కమిషనరా?