తీహార్ జైల్లో చిద్దూను కలిసిన సోనియా, మన్మోహన్ సింగ్

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో రిమాండ్‌‌లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కలిశారు. ఈ సందర్భంగా చిదంబరంతో వారు పలు విషయాలు చర్చించినట్లు తెలిసింది. కాగా ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని ఈడీ, సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్ట్ 21న చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేయగా.. సెప్టెంబర్ 5 నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు.  చిదంబరం బెయిల్ […]

తీహార్ జైల్లో చిద్దూను కలిసిన సోనియా, మన్మోహన్ సింగ్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 23, 2019 | 2:35 PM

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో రిమాండ్‌‌లో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కలిశారు. ఈ సందర్భంగా చిదంబరంతో వారు పలు విషయాలు చర్చించినట్లు తెలిసింది. కాగా ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని ఈడీ, సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్ట్ 21న చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేయగా.. సెప్టెంబర్ 5 నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు.  చిదంబరం బెయిల్ పిటిషన్ ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో సోనియా, మన్మోహన్ ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాగా సోనియా, మన్మోహన్‌లను కలిసిన తరువాత చిదంబరం అధికారిక ట్విట్టర్‌ నుంచి ఓ ట్వీట్ వచ్చింది. అందులో నా తరఫున నా కుటుంబ సభ్యులను ఈ ట్వీట్ చేయమని చెప్పాను. బంగారు రెక్కలు వచ్చి చందమామ మీదకు ఎగిరిపోవాలని నేను అనుకుంటున్నట్లు కొందరు భావిస్తున్నారు. కానీ నేను సురక్షితంగా ల్యాండ్ అవుతా అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.