TV9 WITT: “అజిత్ బీజేపీతో కలవగానే సుద్దపూస అయిపోయాడా”: ప్రమోద్ తివారీ
టీవీ9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే 3వ రోజు సత్తా సమ్మేళన్ సదస్సులో బీజేపీ నేత గౌరవ్ భాటియా, కాంగ్రెస్‌కు చెందిన ప్రమోద్ తివారీ మధ్య మాటల యద్ధం నడిచింది. అవినీతికి సంబంధించి ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. ఆ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం..
టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే మూడు రోజుల కార్యక్రమంలో ఇవాళ ఫైనల్ డే. నేటి కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ చర్చా వేదికపై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రమోద్ తివారీ, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మధ్య సంవాదం జరిగింది. అవినీతి విషయంలో బీజేపీ మాటలకు, చర్యలకు తేడా ఉందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత ప్రమోద్ తివారీ అన్నారు. అందుకు ప్రమోద్ తివారీ ఇప్పుడు బిజెపితో ఉన్న అజిత్ పవార్‌ను ఉదాహరణగా చెప్పారు. బీజేపీ నేతలు అవినీతి చేస్తే.. దాన్ని అవినీతిలా చూడరని, వేరే వాళ్లని మాత్రమే హైలెట్ చేస్తారని ప్రమోద్ తివారీ అన్నారు. దీనిపై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ గత పదేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలేదని, ప్రధాని మోదీ రికార్డు క్లీన్ అని అన్నారు.
“బీజేపీలో చేరితే పదవులు, డబ్బులు – వద్దనుకుంటే అరెస్ట్‌లు కేసులు”
అజిత్ పవార్‌ను అవినీతిపరుడని గతంలో ప్రధాని గతంలో పిలిచేవారని, ఇప్పుడు బీజేపీతో అనుబంధంగా కొనసాగితే సుద్దుపూస అయిపోయారా అని ప్రమోద్ తివారీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం బీజేపీతో కలిసి నడుస్తున్న ఆయనకు ఆయనకు ఆర్థిక శాఖను అప్పగించడాన్ని ప్రమోద్ తివారి హైలెట్ చేశారు.
ఇక యూపీ రాజ్యసభ ఎన్నికల్లో ఎస్పీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేయడంతో ఎస్పీకి ఎదురుదెబ్బ గురించి ప్రమోద్ తివారీ మాట్లాడుతూ, ప్రతి రాజకీయ నాయకుడు తమకు ప్రయోజనం చేకూరుతుందని భావించే పార్టీలో చేరతారని.. తమ రాజకీయ జీవితాన్ని చూసుకుంటున్నారని పేర్కొన్నారు. దానికి గౌరవ్ భాటియా స్పందింస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బిజెపి అయస్కాంతంగా అభివర్ణించారు. ఆయన దేశానికి అనుకూలంగా పని చేయడానికి ప్రజలను ఆకర్షిస్తారని చెప్పారు. “దేశ భక్తి” ఉన్న ప్రజలు, నాయకులు తమతో చేరుతున్నారని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి
భారత్ ఆలోచనలు, ఆకాంక్షలను టీవీ9 శిఖరాగ్ర సదస్సు Live కోసం ఇక్కడ క్లిక్ చేయండి…