What India Thinks Today: అసద్ ఎంత ఎక్కువ మాట్లాడితే మోదీకి అంత మేలు.. బాబా రాందేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
అసదుద్దీన్ ఒవైసీ ఎంత ఎక్కువ మాట్లాడితే ప్రధాని మోదీకి అంత లాభమని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. టీవీ9 నెట్‌వర్క్ ఢిల్లీలో నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో పాల్గొన్న బాబా రాందేవ్.. రాజకీయ అంశాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అసదుద్దీన్ ఒవైసీ ఎంత ఎక్కువ మాట్లాడితే ప్రధాని మోదీకి, బీజేపీకి అంత లాభమని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. టీవీ9 నెట్‌వర్క్ ఢిల్లీలో నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో పాల్గొన్న బాబా రాందేవ్.. రాజకీయ అంశాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ బీజేపీకి బీ టీమ్ అన్న ప్రచారముందని.. అయితే తాను అలా అనడం లేదన్నారు. అయితే అసదుద్దీన్ ఎంత ఎక్కువగా మాట్లాడితే.. ప్రధాని మోదీకి అంత ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
దేశంలో యూనిఫాం సివిడ్ కోడ్ అమలు చేయాలన్న డిమాండ్ సరైనదేనని బాబా రాందేవ్ అన్నారు. ఒక దేశంలో ఒకే చట్టం ఉండాలని.. ఇదే మన రాజ్యాంగ స్ఫూర్తిగా పేర్కొన్నారు. యూసీసీ ఉత్తరాఖండ్ నుంచి ప్రారంభం కావడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాలు కూడా యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. దేశం కంటే ఏదీ గొప్పది కాదని వ్యాఖ్యానించారు. అయితే దీన్ని అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించడం సరికాదన్నారు. అసద్ మెలికలు తిరిగిన వ్యక్తిగా ఎద్దేవా చేసిన బాబా రాందేవ్..ఆయన పూర్వీకులు కూడా దేశ వ్యతిరేకులంటూ ధ్వజమెత్తారు.
ప్రతిపక్ష నేతలు పిచ్చి మాటలు మాట్లాడితే మోదీజీకి కచ్చితంగా 400 సీట్లు వస్తాయని బాబా రాందేవ్ అన్నారు. సెక్యులర్‌గా చెప్పుకునే వ్యక్తి కంటే మూర్ఖుడు, అహేతుకుడు ఎవరూ ఉండరని అన్నారు. సీఎం నితీష్ కుమార్‌పై రామ్‌దేవ్ మాట్లాడుతూ.. తాను లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ, నితీశ్ కుమార్‌లకు యోగా నేర్పించానని తెలిపారు. గతంలో లాలూ కూడా యోగా చేసేవారని, కానీ మధ్యలో రివర్స్‌లో చేయడం ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తేజస్వి బాగా యోగా చేస్తున్నారని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి