Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి.. ప్రధాని మోడీ ప్రారంభించిన నాలుగు రోజులకే దుశ్చర్య..
పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లతో దాడి జరిగింది. కథియా డివిజన్‌లోని సాంసీ కుమార్‌గంజ్ మాల్దా స్టేషన్ సమీపంలో
పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లతో దాడి జరిగింది. కథియా డివిజన్‌లోని సాంసీ కుమార్‌గంజ్ మాల్దా స్టేషన్ సమీపంలో జల్‌పైగురి నుంచి హౌరా సెమీ హైస్పీడ్ రైలుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వినట్లు పోలీసులు వెల్లడించారు. కదులుతున్న రైలుపై ఒక్కసారిగా రాళ్లతో దాడి చేయడంతో.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన అనేక కోచ్‌లు దెబ్బతిన్నాయి. పలు కోచ్ ల కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. రైలులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. దీని వల్ల రైలు ఆలస్యం కాలేదని.. సమయానికి గమ్యానికి చేరుకున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. ఈ ఘటనపై రైల్వే అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
న్యూ జల్‌పైగురి నుంచి హౌరాకు వెళ్తుండగా వందేభారత్ రైలు సి-13 కోచ్‌పై రాళ్లు విసిరినట్లు పేర్కొంటున్నారు. రైలు ప్రారంభించిన నాలుగు రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30న పశ్చిమ బెంగాల్‌లో సెమీ హైస్పీడ్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. జరిగింది.
West Bengal | Stones pelted at Vande Bharat Express connecting Howrah to New Jalpaiguri, 4 days after its launch. The incident took place near Malda station. pic.twitter.com/Nm3XOmffpR
— ANI (@ANI) January 3, 2023
ఈ ఘటన తర్వాత రైల్వే చట్టంలోని సెక్షన్ 154 కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కాగా, ఈ ఘటనకు పాల్పడిన దోషులపై నేరం రుజువైతే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా, రెండూ కూడా విధించే అవకాశం ఉంది.
కొత్తగా ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ నేత వారిస్ పఠాన్ 2022 నవంబర్‌లో అహ్మదాబాద్ నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు రైలులో వెళుతుండగా రాళ్లు కొందరు రాళ్లు రువ్వారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..