AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Vaishnaw: ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వం.. ట్రైన్‌ యాక్సిడెంట్ స్పాట్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి..

సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయాలైన వారికి రూ. 25,000 ల పరిహారం అందించనున్నట్లు రైల్వే, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Ashwini Vaishnaw: ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వం.. ట్రైన్‌ యాక్సిడెంట్ స్పాట్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి..
Ashwini Vaishnaw
Shaik Madar Saheb
|

Updated on: Jan 03, 2023 | 9:21 AM

Share

రాజస్థాన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 26 మంది గాయపడిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో బాంద్రా టెర్మినస్-జోధ్‌పూర్ సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు ఎనిమిది కోచ్‌లు పట్టాలు తప్పాయి. రైలు ముంబై నుంచి జోధ్‌పుర్‌కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 26 మంది పైగా ప్రయాణికులు గాయపడ్డారని.. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని భారతీయ రైల్వే ప్రకటించింది. గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా సైతం ప్రకటించింది.

సూర్యనగరి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయాలైన వారికి రూ. 25,000 ల పరిహారం అందించనున్నట్లు రైల్వే, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీంతోపాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ హుటాహుటిన రాజస్థాన్‌ వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాత్రి జోధ్‌పూర్‌ డివిజన్‌ రాజ్‌కియవాస్‌-బొమద్రా సెక్షన్‌ పరిధిలోని పాలీ ప్రాంతానికి చేరుకున్న అశ్విని వైష్ణవ్‌ ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 8 స్లీపర్‌ క్లాస్‌ బోగిలు పట్టాలు తప్పాయని అధికారులు మంత్రికి వివరించారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ సందర్భంగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌.. రైల్వే పట్టాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విరిగిపోయిన ట్రాక్ ముక్కలను పరిశీలించారు. ఎవరైనా కావాలని పట్టాలను కోసారా..? లేకా మరేదైనా కుట్రకోణం ఉందా..? అనే విషయాల గురించి ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియోను అశ్విని వైష్ణవ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. టెక్నికల్ అండ్ ఫోరెన్సిక్ ద్వారా దర్యాప్తు నిర్వహించి, ఘటనకు గల కారణాన్ని కనుగొంటామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సాంకేతిక మార్పులు చేస్తామని ఆయన వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..!
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఏసీ 8 గంటలు ఆన్ చేసినా.. కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఇలా చేయండి
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
ఫోన్‌కు వచ్చిన ట్రాఫిక్ చలానా పరిశీలించిన వ్యక్తి.. ఓపెన్ చేయగా
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
తెలంగాణకు కేంద్రం భారీ కానుక.. రెండు కొత్త రైల్వే ప్రాజెక్టులు!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
రాసిపెట్టుకోండి..వారికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరిగే ఛాన్స్..!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
వాట్సాప్ యాప్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు!
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..