Assembly Election 2021 Date LIVE: దేశంలో నాలుగు రాష్ట్రాలతోపాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీల ప్రకటన …
WB, Kerala, TN, Assam and Puducherry Election 2021 Result and Voting Schedule: దేశంలో నాలుగు రాష్ట్రాలతోపాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించేందుకు సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో
దేశంలో నాలుగు రాష్ట్రాలతోపాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ప్రకటించేందుకు సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ షెడ్యూల్‌ను శుక్రవారం సాయంత్రం ప్రకటించనున్నారు. ఏప్రిల్, మే నెలల మధ్య ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం మరి కాసేపట్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో.. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించనుంది ఎన్నికల సంఘం.
అలాగే తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం ఉప ఎన్నికకు సైతం షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పోటీ టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఈ స్థానం ఖాళీగా ఉంది. అలాగే ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి సైతం షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లో 77,413 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసాం గతంతో పోల్చుకుంటే 39.6 శాతం పెంచినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నాలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచారు. అలాగే తమ ఫ్రంట్‌లైన్ వారియర్స్ కు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ అందేలా జాగ్రత్తలు తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది.
అస్సాంలో 33530 పోలింగ్ కేంద్రాలు – టిఎన్‌లో 88936 పోలింగ్ కేంద్రాలు – వెస్ట్ బెంగాల్ లో 101916 పోలింగ్ కేంద్రాలు – కేరళలో 40771 స్టేషన్లు – పుదుచ్చేరిలో 1559 స్టేషన్లు, పశ్చిమ బెంగాల్‌లో 77,413 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు.
అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లు ఉండగా అందులో బిజెపి 60, ఎజిపి 14, కాంగ్రెస్ 26, ఎఐయుడిఎఫ్ 13, బిఓపిఎఫ్ 12 స్థానాలను గత ఎన్నికల్లో గెలుచుకున్నాయి. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐఎడిఎంకె 135, డిఎంకె 88, కాంగ్రెస్ 8 స్థానాలను గెలుచుకున్నాయి.
LIVE NEWS & UPDATES
-
మే 2 అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి..
మొత్తం నాలుగు రాష్ట్రాలతోపాటు ఒక కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల షడ్యూలును ఎన్నికల సంఘం విడుదల చేసింది. మే 2 అన్ని రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అస్సాంలో మూడు దశలుగా ఎన్నికలు జరగనుంది, వెస్ట్ బెంగాల్ లో రికార్డ్ స్థాయిలో 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 2 అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదల చేయనున్నారు.
-
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2021
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2021 – పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు మొత్తం 8 దశలు ఉంటాయి. మొదటి దశ- 27 మార్చి రెండవ దశ – 1 ఏప్రిల్ మూడవ దశ – 6 ఏప్రిల్ నాలుగో దశ – 10 ఏప్రిల్ 5 వ దశ – 17 ఏప్రిల్ 6వ దశ -22 ఏప్రిల్ 7 వ దశ-26 ఏప్రిల్ 8 వ దశ -29 ఏప్రిల్, ఓట్ల లెక్కింపు – 2 మే
-
-
పుదుచ్చేరి 30స్థానాలకు ఎన్నికలు ఎప్పుడంటే..
పుదుచ్చేరిలో 30స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఏప్రిల్ 6న నిర్వహించనుంది ఎన్నికల సంఘం .
-
కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2021: కేరళలో సింగిల్ ఫెస్ ఓటింగ్
కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2021: కేరళలో ఒకే దశ ఓటింగ్ జరగనుంది. ఎన్నికల తేదీ ఏప్రిల్6
-
అస్సాం లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు..
అస్సాంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశ – 47 సీట్ల నోటిఫికేషన్లు, ఓటింగ్ – 27 మార్చి,రెండవ దశ – 39 సీట్లకుఓటింగ్ – 1 ఏప్రిల్ 1న నిర్వహించనున్నారు. మూడవ దశ ఓటింగ్ – ఏప్రిల్ 6 న జరగనుంది.
-
-
ఎన్నికల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారంటే ..
పుదుచ్చేరిలో (ఒక సీటుకు)22 లక్షలు , మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో, ఒక అభ్యర్థి ఒక సీటుకు రూ .30 లక్షలు ఖర్చు చేయవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ఇది తన చివరి విలేకరుల సమావేశం అని సునీల్ అరోరా చెప్పారు. ఎందుకంటే ఆయన పదవీకాలం రాబోయే రోజుల్లో ముగియబోతోంది
-
పండుగలు, పరీక్షలు దృష్టిలో ఉంచుకొని ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నాం. : సునీల్
ఎన్నికల సందర్భంగా పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామన్నామని ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. పరీక్షలు,పండుగల రోజుల్లో ఓటింగ్ ఉండదన్నారు సునీల్.
-
80ఏళ్ళు పైబడిన వృద్దులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు: ఈసీ
80ఏళ్ళు పైబడిన వృద్దులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. వృద్దులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చు అని సునీల్ తెలిపారు. ఇంతకాలం కేవలం సర్వీసెస్ లో ఉన్నవారు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఇప్పుడు 80ఏళ్ళు పైబడిన వృద్దులకు ఈ సౌకర్యం కల్పించింది ఈసీ.
-
ఇంటింటికీ ప్రచారం చేయడానికి 5 మందికే అనుమతి : ఈసీ
అభ్యర్థితో కలిసి 5 మంది మాత్రమే ఇంటింటికీ ప్రచారం చేయడానికి అనుమతి ఉందని సునీల్ అన్నారు. ఎన్నికల జరిగే ఐదు రాష్ట్రాల్లో కేంద్ర దళాలను (పారా మిలటరీ ఫోర్స్) మోహరిస్తామని సునీల్ అరోరా తెలిపారు.
-
ఏ రాష్ట్రంలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారంటే..
అస్సాంలో 33530 పోలింగ్ కేంద్రాలు – టిఎన్‌లో 88936 పోలింగ్ కేంద్రాలు – వెస్ట్ బెంగాల్ లో 101916 పోలింగ్ కేంద్రాలు – కేరళలో 40771 స్టేషన్లు – పుదుచ్చేరిలో 1559 స్టేషన్లు, పశ్చిమ బెంగాల్‌లో 77,413 పోలింగ్ కేంద్రాలు
-
నామినేషన్ సమయంలో, ఇద్దరు వ్యక్తులు మాత్రమే అభ్యర్థితో వెళ్ళాలి : ఈసీ
ప్రజలు ఓట్లు వేసే సమయం ఒక గంటపాటు పొడిగించబడిందని. బీహార్‌లో కూడా ఇదే జరిగిందని ఈసీ తెలిపింది. నామినేషన్ సమయంలో, ఇద్దరు వ్యక్తులు మాత్రమే అభ్యర్థితో వెళ్లాలని సూచించింది.
-
పశ్చిమ బెంగాల్‌లో 77,413 పోలింగ్ కేంద్రాలు : సునీల్
పశ్చిమ బెంగాల్‌లో 77,413 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసాం గతంతో పోల్చుకుంటే 39.6 శాతం పెంచినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. నాలుగు రాష్ట్రాల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచారు. అలాగే తమ ఫ్రంట్‌లైన్ వారియర్స్ కు ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ అందేలా జాగ్రత్తలు తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది.
-
5 రాష్ట్రాల్లో 824 అసెంబ్లీ స్థానాలపై ఎన్నికలు జరగనున్నాయి..
5 రాష్ట్రాల్లో 824 అసెంబ్లీ స్థానాలలో ఎన్నికలు జరగనున్నాయని, 2.7 లక్షల పోలింగ్ బూత్‌లలో మొత్తం 18.68 కోట్ల మంది ఓటర్లు ఓటు వేస్తారని సునీల్ అరోరా తెలిపారు.
-
ఎన్నికల సమయంలో ప్రజల భద్రత కోసం చర్యలు చేపడతాం..
కరోనా నేపథ్యంలో ఎన్నికల సమయంలో ప్రజల భద్రత కోసం చర్యలు చేపడతామని సునీల్ అరోరా. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కరోనా కాలంలోనూ మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని అరోరా గుర్తుచేసారు.
-
కరోనా కాలంలో బీహార్‌లో ఎన్నికలు నిర్వహించడం అంత సులభం కాదు – సునీల్ అరోరా
కరోనా నేపథ్యంలో బీహార్‌లో ఎన్నికలు నిర్వహించడం పెద్ద సవాలు గా మారిందని సునీల్ అరోరా అన్నారు. చాలా మంది ప్రభుత్వ అధికారులు కరోనా బారిన పడ్డారు. కానీ తరువాత కోలుకొని మళ్ళీ డ్యూటీలో చేరారని సునీల్ అన్నారు.
-
ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం ప్రారంభమవుతుంది
విజ్ఞన్ భవన్‌లో ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం ప్రారంభమైంది. ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా మీడియాతో ప్రసంగిస్తున్నారు. ఈ రోజు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నామన్నారు.
-
అస్సాం, తమిళనాడు 2016 ఎన్నికలు ఫలితాలు ఇలా ఉన్నాయి.
అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లు ఉండగా అందులో బిజెపి 60, ఎజిపి 14, కాంగ్రెస్ 26, ఎఐయుడిఎఫ్ 13, బిఓపిఎఫ్ 12 స్థానాలను గత ఎన్నికల్లో గెలుచుకున్నాయి. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐఎడిఎంకె 135, డిఎంకె 88, కాంగ్రెస్ 8 స్థానాలను గెలుచుకున్నాయి.
-
పశ్చిమ బెంగాల్ 2016 ఎన్నికల ఫలితాలు పై ఈసీ..
పశ్చిమ బెంగాల్ గురించిమాట్లాడుతూ.. అక్కడ 294 సీట్లు ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ టిఎంసి 211, కాంగ్రెస్ 44, లెఫ్ట్ 32, బిజెపి 3, మరికొందరు 04 సీట్లు గెలుచుకున్నాయని అంది.
-
కేరళ రాష్ట్రం గురించి ఎన్నికల సంఘం ఏమన్నదంటే..
కేరళ రాష్ట్రం గురించి ఎన్నికల సంఘం మాట్లాడుతూ.. అక్కడ మొత్తం 140 సీట్లు ఉన్నాయి. 2016 లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కు 84 సీట్లు, యుడిఎఫ్‌కు 47 సీట్లు, బిజెపికి 01 సీట్లు, మరికొందరికి 8 సీట్లు వచ్చాయని గుర్తు చేసింది.
-
విజ్ఞన్ భవన్‌కు చేరుకున్న ఎన్నికల సంఘం బృందం..
ఎన్నికల సంఘం బృందం కొద్దిసేపటి క్రితమే విజ్ఞాన్ భవన్‌కు చేరుకుంది. దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను మరికాసేపట్లో ప్రకటించనున్నారు. కరోనా మార్గదర్శకాలు విజ్ఞన్ భవన్ వద్ద పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు.
-
పశ్చిమ బెంగాల్ 6-8 దశల్లో పోలింగ్ ప్రక్రియ నిర్వహించే అవకాశం..
పశ్చిమ బెంగాల్‌లో ఓటింగ్ 6-8 దశల్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇందులో మొదటి దశ ఓటింగ్ మార్చి చివర్లో, చివరి దశ మే నెలలో జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.
-
ఏ ఏ రాష్ట్రంలో ఎన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయంటే ..
కేరళలోని 140 సీట్లలో ఎన్నికలు జరగనున్నాయి. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. తమిళనాడులో 232 సీట్లలో ఓట్లు వేయనున్నారు. అస్సాంలో 126 సీట్లు పశ్చిమ బెంగాల్‌లోని 294 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
-
పశ్చిమ బెంగాల్‌తో సహా 5 రాష్ట్రాల్లో ఈ రోజు ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు..
రాబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర హోంశాఖ కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) మరియు సాయుధ దళాలను జారీ చేసినట్లు అధికారులు ఇటీవల నివేదించారు.
Published On - Feb 26,2021 5:50 PM