బార్డర్‌లో అరుదైన పక్షుల పట్టివేత
సరిహద్దు నుంచి మన దేశంలోని పలు అరుదైన పక్షులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాకు బీఎస్‌ఎఫ్ చెక్ పెట్టింది. బార్డర్ నుంచి మన దేశంలోకి అక్రమంగా చిలుకల వంటి పలు అరుదైన పక్షులను రవాణా..
సరిహద్దు నుంచి మన దేశంలోని పలు అరుదైన పక్షులను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాకు బీఎస్‌ఎఫ్ చెక్ పెట్టింది. బార్డర్ నుంచి మన దేశంలోకి అక్రమంగా చిలుకల వంటి పలు అరుదైన పక్షులను రవాణా చేస్తున్న స్మగ్లర్లను మంగళవారం రాత్రి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 36 పక్షులను స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ బెంగాల్‌లోని బారాన్‌బెరియా సరిహద్దులోని ఔట్ పోస్ట్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. స్వాధీనం చేసుకున్న పక్షులను రణఘాట్ ఫారెస్ట్ ఆఫీస్‌లో అందజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి స్మగ్లర్లను అరెస్ట్ చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
West Bengal: 36 birds that were being smuggled from Border Outpost, Baranberia were seized by Border Security Force last night. The rescued birds were handed over to Ranaghat forest office. pic.twitter.com/6wLb8VfDid
— ANI (@ANI) August 12, 2020
Read More :