యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ… బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి

యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు.

యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికల్లో ఒంటరిగానే  పోటీ... బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి
Mayawati
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 27, 2021 | 1:24 PM

యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ఈ రాష్ట్ర శాసన సభలకు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎలెక్షన్స లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం తో తాము పొత్తు పెట్టుకోవచ్చునని వచ్చిన వార్తలను ఆమె కొట్టి పారేశారు. పంజాబ్ ఎన్నికల వరకే మేం శిరోమణి అకాలీదళ్ తో పొత్తు పెట్టుకున్నట్టు ఆమె వివరించారు. 117 సీట్లున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో బీఎస్పీ 20 స్థానాలకు, శిరోమణి అకాలీదళ్ 97 సీట్లకు పోటీ చేస్తున్నాయి. ఇలా ఉండగా యూపీ ఎన్నికల్లో తాము కూడా ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగుతామని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఇదివరకే ప్రకటించారు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు. 2019 నాటి ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ-సమాజ్ వాదీ మధ్య పొత్తు బెడిసి కొట్టిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల దారులూ వేరయ్యాయి.

యూపీలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందని..2017 లో ఆ పార్టీతో తాము చేతులు కలిపినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆయన చెప్పారు. ఆ పార్టీకి 100 సీట్లు ఇచ్చినా వారు గెలవలేకపోయారన్నారు. ఇప్పుడు తమతో కలిసి వచ్చే పక్షాలతోను, భావసారూప్యం గల చిన్నా చితకా పార్టీలతోనూ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఇలా ఉండగా మాయావతి ఇటీవలి కాలంలో బీజేపీ పట్ల మెతకగా మాట్లాడడం పలు ఊహాగానాలకు తావిస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: 12-18 ఏళ్ళ మధ్య వయస్సు వారికి త్వరలో జైడస్ క్యాడిలా వ్యాక్సిన్… సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

actor Nani : వ్యాక్సిన్ వేయించుకున్న నేచురల్ స్టార్ నాని.. త్వరలోనే షూటింగ్ కు

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?