AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాక్సినేషన్ లో పాత రికార్డులనన్నింటినీ అధిగమించాం… ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా…

ఢిల్లీలో నిన్న 2.05 లక్షల,మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించారు. ఇది పాత రికార్డులనన్నింటినీ అధిగమించినట్టే అని చెప్పారు.

వ్యాక్సినేషన్ లో పాత రికార్డులనన్నింటినీ అధిగమించాం... ఢిల్లీ  డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా...
Manish Sisodia
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 27, 2021 | 1:32 PM

Share

ఢిల్లీలో నిన్న 2.05 లక్షల,మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించారు. ఇది పాత రికార్డులనన్నింటినీ అధిగమించినట్టే అని చెప్పారు. నగరంలో రోజూ సుమారు లక్షన్నర మందికి టీకామందు ఇస్తున్నామని, కానీ నిన్న ఒక్కరోజే ఇంతమందికి ఇచ్చామని ఆయన ట్వీట్ చేశారు. ఇలా థర్డ్ కోవిద్ వేవ్ నుంచి నగరవాసులను రక్షిస్తున్నామని మనీష్ సిసోడియా చెప్పారు. నగరంలో ఇంచుమించు అన్ని ప్రధాన రూట్లలో 130 వ్యాక్సిన్ కేంద్రాలు ఉన్నాయని, ప్రజలు స్వచ్చందంగా వచ్చి టీకామందు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. కాగా నిన్నటివరకు ఢిల్లీలో 73,28,647 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని కోవిన్ పోర్టల్ తెలిపింది. 18-44 ఏళ్ళ వయస్కుల్లో 31.87 లక్షల మంది…45-60 ఏళ్ళ మధ్య వయస్సువారిలో 25 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నట్టు పేర్కొంది. జులై నెలకు గాను నగరానికి 45 లక్షల డోసుల వ్యాక్సిన్ అవసరమని ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో తెలిపిందని ఆప్ ఎమ్మెల్యే అతిషి వెల్లడించారు.. ఈ మేరకు ఆమె వ్యాక్సిన్ బులెటిన్ జారీ చేస్తూ…కేంద్రం వెంటనే ఈ అభ్యర్థనకు స్పందించాలని, ఇప్పటినుంచే ఇన్ని లక్షల డోసుల టీకామందును ఢిల్లీకి కేటాయించాలని కోరారు.

ఇతర రాష్ట్రాలు కూడా ఎప్పటికప్పుడు ఇలా తమ వ్యాక్సినేషన్ లెక్కలను (ఎంతమందికి టీకామందు ఇచ్చిందీ) తెలియజేయాలని కేంద్రం కోరుతోంది. తద్వారా ఈ ఏడాది అంతానికి దేశ జనాభాకంతటికీ టీకామందుల కార్యక్రమాన్నిపూర్తి చేయాలన్న తమ లక్ష్యాన్ని సాధించగలుగుతామా అని ఓ అంచనాకు రాగలుగుతామని పేర్కొంది. కాగా-ఇండియాలో గత 24గంటల్లో 50,040 కోవిద్ కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు 96.72 శాతం ఉన్నప్పటికీ తాజాగా 1258 మంది రోగులు మృతి చెందినట్టు వెల్లడించింది. అన్-లాక్ ప్రక్రియ మొదలుపెట్టినందున బహుశా కేసులు ఇంకా తగ్గడంలేదా అని భావిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: అమెరికా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రయత్నిస్తా… మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

Telangana DGP: మరియమ్మ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు.. ఖమ్మంలో పర్యటించిన డీజీపీ