Watch Video: బీజేపీ ఎమ్మెల్యే తీరుపై నెటిజన్ల ఆగ్రహం.. బూట్లు తడుస్తాయని ఏం చేశాడో తెలుసా..?

బీజేపీ ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. ఎంతో బాధ్యాయుతంగా వ్యవహరించాల్సిన ప్రజా ప్రతినిధులు ఇలా ఓవర్‌యాక్షన్‌ చేయడంపై వరదబాధితులు, నెటిజన్లు మండిపడుతున్నారు.

Watch Video: బీజేపీ ఎమ్మెల్యే తీరుపై నెటిజన్ల ఆగ్రహం.. బూట్లు తడుస్తాయని ఏం చేశాడో తెలుసా..?
Assam Bjp Mla
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 19, 2022 | 5:54 PM

Assam BJP MLA takes piggyback ride: ఈశాన్య రాష్ట్రం అసోంలో వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో సామాన్య ప్రజలు అల్లాడిపోతుంటే ప్రజాప్రతినిధులకు మాత్రం ఈ పరిస్థితి ఆటవిడుపుగా మారింది. లుమ్‌డింగ్ బీజేపీ ఎమ్మెల్యే శిబూ మిశ్రా (Sibu Misra) చేసిన పనిని చూసి అందరూ ఛీత్కరించుకుంటున్నారు. ఆయన వెళ్ళిన చోట పెద్ద వరద లేదు. నీళ్లలో తన బూట్లు పాడవుతాయన్న కారణంగా సహాయకచర్యల్లో పాల్గొంటున్న జవాన్‌ భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు. దీంతో ఆ జవాన్ నీళ్లలోనుంచి తీసుకెళ్లి.. బోటు దగ్గరకు చేర్చాడు. నేరుగా బోటులోకి ఎక్కిన ఎమ్మెల్యే అనంతరం సహాయక చర్యలను పర్యవేక్షించారు. బీజేపీ ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. ఎంతో బాధ్యాయుతంగా వ్యవహరించాల్సిన ప్రజా ప్రతినిధులు ఇలా ఓవర్‌యాక్షన్‌ చేయడంపై వరదబాధితులు, నెటిజన్లు మండిపడుతున్నారు. బాధ్యతగల పదవిలో ఉండి.. ఇదేం పని అంటూ ప్రశ్నిస్తున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే సిబు మిశ్రా బుధవారం హోజాయ్ పరిధిలోని వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు. ఈ క్రమంలో ఓ చోట విప‌రీత‌మైన నీరు ఉండ‌టం ద్వారా ఆయ‌న‌కు దాట‌డం సాధ్యపడలేదు. దీంతో అక్కడున్న రెస్క్యూ టీమ్ సిబ్బంది ఒకరి వీపుపై ఎక్కి, ఎమ్మెల్యే ప‌డ‌వ వ‌ర‌కూ వెళ్లారు. అయితే.. ఈ ప్రాంతంలో పెద్దగా నీళ్లేమీ లేవు. అయినా రెస్క్యూ టీమ్ స‌భ్యుడి వీపుపై ఎక్కి, ప‌డ‌వ వ‌ర‌కూ వెళ్లడం ఏంట‌ని నెటిజ‌న్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి.. 

కాగా.. ఈశాన్య రాష్ట్రంలో సంభవించిన వరదలతో ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించారు. వరదల వల్ల 27 జిల్లాల్లోని 6.6 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సుమారు 1089 గ్రామాలు నీట మునిగాయి. కొండ‌చ‌రియలు విరిగి ప‌డుతుండ‌టంతో వందలాది ఇళ్లు నేల‌మట్టం అయ్యాయి.