Viral: పాము కనిపించిందని చెప్పి ఇల్లు ఖాళీ చేశారు.. నిజమేనా అని ఇంట్లో వెతగ్గా మైండ్ బ్లాంక్
ఇంట్లో నుంచి పాములు వస్తున్న.. ఈ భయానక దృశ్యాన్ని చూసిన ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. పాములు పట్టుకునే వ్యక్తికి ఫోన్ చేయడంతో అతనొచ్చి పాములను పట్టుకున్నాడు.
60 snakes rescued: సాధారణంగా పామును చూస్తే.. భయంతో పరుగులు తీస్తుంటాం. అదే ఇంట్లో కుప్పలు తెప్పలుగా పాములు కనిపిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. ఇలాంటి సమయాల్లో ఊపిరి ఆగిపోయేంత పనవుతుంది. తాజాగా.. యూపీలోని ఓ ఇంట్లో ఒకేచోట 60 పాములు బయటపడ్డాయి. ఇది వింటే మీరు షాక్ అవుతారు.. కానీ ఇది నిజం. దీనితో పాటు 75 పాము గుడ్లు కూడా లభించాయి. ఇంట్లో నుంచి పాములు వస్తున్న.. ఈ భయానక దృశ్యాన్ని చూసిన ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. పాములు పట్టుకునే వ్యక్తికి ఫోన్ చేయడంతో అతనొచ్చి పాములను పట్టుకున్నాడు. అయితే.. అప్పటికే.. కొన్ని పాములు బయటకు రావడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
యూపీలోని ముజాఫర్ నగర్ ఖతౌలీ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అశోక్ విహార్ ఆవాస్ వికాస్ కాలనీలోని కడ్లి గ్రామానికి చెందిన రంజిత్ సింగ్ ఇంటి నంబర్ ఇ-218 ఉంది. ఈ క్రమంలో నరేష్‌పాల్ కుటుంబానికి ఇంటిని అద్దెకు ఇచ్చారు. మే 8వ తేదీన వాషింగ్ మెషీన్ దగ్గర పాములు సంచరిస్తున్నట్లు నరేష్‌పాల్ భార్య గమనించింది. ఈ క్రమంలో ఆమెకు మరికొన్ని పాములు కనిపించాయి. ఈ విషయాన్ని ఇంటి యజమానికి చెప్పింది. దీంతోపాటు ఇంటిని ఖాళీ సైతం చేశారు. ఆ తర్వాత యజమాని పాములు ఎక్కడ ఉన్నాయో వెతకడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో బుధవారం కూలీలను పెట్టి పాములను వెతుకుతూ.. బాత్‌రూమ్, టాయిలెట్ ఫ్లోర్‌లను తొలగించారు. దాని కింద దాదాపు 60 పాములు నక్కి ఉన్నాయి. దీంతోపాటు 75 గుడ్లు కూడా లభించాయి. పాములు ఒక్కసారిగా పరుగులు తీయడంతో.. కాలనీ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
సమాచారం మేరకు పాములను పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ వచ్చి.. గంటల కొద్ది శ్రమించి పాములను సీసాలలో బంధించి తీసుకెళ్ళాడు. దీంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.