AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rowdy Baby Song: యూట్యూబ్ నుంచి మాయమైన రౌడీ బేబీ సాంగ్.. షాక్‏లో అభిమానులు.. కారణమేంటంటే..

రౌడీ బేబీ సాంగ్ మాత్రం యూట్యూబ్‏ను షేక్ చేసింది. ఇప్పటికీ ఈ సాంగ్ మిలియన్స్ వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతుంది.

Rowdy Baby Song: యూట్యూబ్ నుంచి మాయమైన రౌడీ బేబీ సాంగ్..  షాక్‏లో అభిమానులు.. కారణమేంటంటే..
Rowdy Baby Song
Rajitha Chanti
|

Updated on: May 19, 2022 | 5:00 PM

Share

తమిళ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush).. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన సినిమా మారి 2 . ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయినప్పటికీ ఇందులోని రౌడీ బేబీ సాంగ్ మాత్రం యూట్యూబ్‏ను షేక్ చేసింది. ఇప్పటికీ ఈ సాంగ్ మిలియన్స్ వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతుంది. ధనుష్.. సాయి పల్లవి కెమిస్ట్రీ ప్రభుదేవా కొరియోగ్రఫీ ఆడియన్స్‏ను ఆకట్టుకుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈపాటకు తమదైన స్టైల్లో కాలు కదిపారు. రోజులు గడుస్తు్న్నా ఈ సాంగ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.. అయితే తాజాగా ఈ పాట యూట్యూబ్ నుంచి మాయమైపోయింది. మే 17న నెటిజన్స్ యూట్యూబ్‏లో సెర్చ్ చేయగా ఈ పాట ఎక్కడా కూడా కనిపించలేదు.. రౌడీ బేబీ సాంగ్ ఏమైందంటూ నెటిజన్స్ ట్వీట్స్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన మేకర్స్ పాటతో పాటు.. అసలు విషయాన్ని ఆడియన్స్‏కు ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.

రౌడీ బేబీ సాంగ్ అప్లోడ్ చేసిన ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్‏బార్ ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ చేసినట్లు గుర్తించారు మేకర్స్. ఆ తర్వాత ఛానెల్ నుంచి రౌడీ బేబీ పాటను డెలిట్ చేశారట… తిరిగి యూట్యూబ్ ఛానెల్ పునరుద్ధరించిన తర్వాత మారి 2 నుంచి రౌడీ బేబీ పాటను అప్లోడ్ చేసినట్లు మేకర్స్ ట్వీట్ చేశారు.. మే 17న ఈ పాట యూట్యూబ్ నుంచి డెలిట్ చేయబడిందని.. ఆ తర్వాత మే 18 న ఈ పాటను తిరిగి అప్లోడ్ చేసినట్లు చెప్పారు.. ఈ పాటకు ఇప్పటివరకు 1.3 బిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది. ధనుష్, సాయి పల్లవి నటించి ఈ పాటకు యువన్ శంకర్ రాజా కంపోజ్ చేశారు..

ఇవి కూడా చదవండి

ట్వీట్..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?