వక్ఫ్ కొత్త చట్టం.. ఆ గ్రామంలో సంబరాలు! ఎందుకంటే..?
లోక్‌సభలో ఆమోదం పొందిన వక్ఫ్ చట్ట సవరణతో కర్ణాటకలోని హోనవాడ్ గ్రామం సంబరాలు చేసుకుంటోంది. గత సంవత్సరం, వక్ఫ్ భూములను వ్యతిరేకిస్తూ ఈ గ్రామ రైతులు చేసిన పోరాటం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. వారి పోరాటం వక్ఫ్ చట్ట సవరణకు ప్రేరణగా నిలిచింది. ఈ విజయం తర్వాత, బీజేపీ నాయకులు గ్రామ రైతులను సత్కరించారు.

తాజాగా లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొదండటంతో ఓ గ్రామం మొత్తం సంబరాలు చేసుకుంది. అందుకు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. గత సంవత్సరం కర్ణాటక రాష్ట్రంలో వక్ఫ్ కు వ్యతిరేకంగా పోరాటం తీవ్రంగా జరిగింది. ముఖ్యంగా, వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలనే పోరాటం మొదట విజయపుర జిల్లాలో ప్రారంభమైంది. జిల్లాలోని టికోటా తాలూకాలోని హోనవాడ్ గ్రామ రైతులకు చెందిన 1200 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు గెజిట్‌లో ఉన్నాయి. దాన్ని ఆ గ్రామస్థులు వ్యతిరేకించారు.
ఇప్పుడు, వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారిన తర్వాత హోనవాడ గ్రామంలోని రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీల వ్యతిరేకత ఉన్నప్పటికీ వక్ఫ్ చట్టానికి సవరణ ఆమోదం లభించి, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వక్ఫ్ సవరణ బిల్లు గురించి లోక్‌సభలో మాట్లాడినప్పుడు, వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా గళం వినిపించిన మొదటి రాష్ట్రం కర్ణాటక. ముఖ్యంగా, విజయపుర జిల్లాలోని హోనావాడ గ్రామానికి చెందిన రైతులు ఈ చట్టం సమస్యకు సంబంధించి తమ గళాన్ని లేవనెత్తారు.
ఈ పోరాటమే వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి ప్రేరణ అని పార్లమెంటులో వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా వక్ఫ్ కు వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహించిన హోనవాడ గ్రామ రైతులను జిల్లా బీజేపీ విభాగం సత్కరించింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గురులింగప్ప అంగడి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సురేష్ బిరాదార్, నాయకుడు విజుగౌడ పాటిల్ హోనవాడ గ్రామానికి వెళ్లి అక్కడి రైతులను శాలువాలతో పూలమాల వేసి సత్కరించారు. అనంతరం బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. హోనవాడ గ్రామ రైతుల పోరాటమే వక్ఫ్ చట్ట సవరణకు కారణమని బీజేపీ నాయకులు అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.