Viral Video: ఆపని చేయొద్దన్నందుకు.. RPF రైల్వే ఇన్స్‌పెక్టర్‌ను వెంటాడి కొట్టిన ట్రాన్స్ జెండర్లు! వీడియో వైరల్
ప్రయాణికుల నుంచి బలవంతం డబ్బులు వసూలు చేస్తుంటారు. ఇది ప్రతి రోజూ, ప్రతి ట్రైన్ లోనూ కనిపించే సీన్. ప్రయాణికుల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నందుకు రైల్వే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా ఓ రైల్వే అధికారి ఇదేంటని ప్రశ్నించడంతో.. ట్రాన్స్‌జెండర్లు మూకుమ్మడిగా..

లక్నో, సెప్టెంబర్ 1: దాదాపు ప్రతి రైలులోనూ ట్రాన్స్ జెండర్లు.. ప్రయాణికుల నుంచి బలవంతం డబ్బులు వసూలు చేస్తుంటారు. ఇది ప్రతి రోజూ, ప్రతి ట్రైన్ లోనూ కనిపించే సీన్. ప్రయాణికుల నుంచి అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నందుకు రైల్వే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా ఓ రైల్వే అధికారి ఇదేంటని ప్రశ్నించడంతో.. ట్రాన్స్‌జెండర్లు మూకుమ్మడిగా దాడిచేసి నానాభీభత్సం సృష్టించారు. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై పరుగెత్తించి ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌పై దాడి చేసి కొట్టారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం రాత్రి (ఆగస్ట్ 31) చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్టేషన్‌లోని సమీపంలోని విక్రేతలు, ఇతర ప్రయాణికులు ట్రాన్స్ జెండర్ల దాడి నుంచి బాధిత RPF ఇన్‌స్పెక్టర్‌ను రక్షించారు.
ఆదివారం రాత్రి సమయంలో ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఆస్ మొహమ్మద్ తన సహోద్యోగులతో కలిసి డియోరియా రైల్వే స్టేషన్‌లో అవధ్ అస్సాం ఎక్స్‌ప్రెస్ రైలును తనిఖీ చేస్తున్నాడు. ట్రాన్స్‌జెండర్లు అక్రమంగా దోపిడీ చేస్తున్నట్లు కొంతమంది ప్రయాణీకులు ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డబ్బు ఇవ్వకపోతే తమతో దారుణంగా ప్రవర్తిస్తున్నట్లు ప్రయాణికులు వాపోయారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు ప్రయాణికుల నుంచి డబ్బు వసూలు చేయవద్దని స్టేషన్ చుట్టూ తిరుగుతున్న ట్రాన్స్‌జెండర్లకు ఇన్‌స్పెక్టర్ సూచించాడు. వీరిపై మరిన్ని ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. దీంతో రెచ్చిపోయిన ట్రాన్స్‌జెండర్లు రైల్వే స్టేషన్‌లో గుంపుగా గుమిగూడి ప్లాట్‌ఫామ్ నంబర్ 1పై నానాయాగి చేయడం ప్రారంభించారు. ప్లాట్‌ఫాంపై రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులతో కూడ దురుసుగా ప్రవర్తించడం ప్రారంభించారు.
#देवरिया– रेलवे स्टेशन पर देर रात किन्नरों का हंगामा, RPF इंस्पेक्टर आस मोहम्मद को दौड़ा-दौड़ाकर पीटा, यात्रियों से अवैध वसूली का आरोप, RPF दफ़्तर में भी तोड़फोड़,दो किन्नर पुलिस हिरासत में। मामला – प्लेटफार्म नंबर 01, सदर स्टेशन।@DeoriaPolice @RailMinIndia @AdgGkr @CMOfficeUP pic.twitter.com/7Mk7lq3fku
— एक भारत श्रेष्ठ भारत (@up52deo) September 1, 2025
ట్రాన్స్‌జెండర్ల గొడవ గురించి సమాచారం అందుకున్న ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఆస్ మొహమ్మద్ కొంత మంది పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహించిన ట్రాన్స్‌జెండర్లు ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ లాఠీని లాక్కొని అతనిపై దాడి చేశారు. ఆ తర్వాత ప్లాట్‌ఫాంపై ఇన్‌స్పెక్టర్‌ను తరిమి కొట్టారు. వారి సంఖ్య RPF అధికారుల కంటే ఎక్కువగా ఉండటంతో ఆర్‌పిఎఫ్ కార్యాలయంలోకి కూడా ప్రవేశించి దానిని ధ్వంసం చేశారు. దీంతో అక్కడే ఉన్న కొందరు ప్రయాణీకులు, విక్రేతలు వారిని తరమికొట్టి ఇన్‌స్పెక్టర్ ప్రాణాలను కాపాడారు. డియోరియా రైల్వే స్టేషన్‌లో ట్రాన్స్‌జెండర్లు సృష్టించిన గందరగోళం కారణంగా చాలా సేపు భయాందోళనలు నెలకొన్నాయి. ఈ గందరగోళం గురించి సమాచారం అందుకున్న తర్వాత GRP సంఘటనా స్థలానికి చేరుకునేలోపు ట్రాన్స్‌జెండర్లంతా పారిపోయారు. దాడి చేసిన వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




