Indian Army: నదిలో చిక్కుకున్న ఇద్దరు యువకులు.. ఆర్మీ సైన్యం రెస్క్యూ ఆపరేషన్‌ .. వీడియో వైరల్..

నదిలో చిక్కుకున్న యువకులను అర్ధరాత్రి, నది ఒరవడి లెక్కచేయకుండా కాపాడారు సైనికులు. జమ్ముకశ్మీర్‌లోని (Jammu and Kashmir) కిషాత్‌వార్‌ జిల్లాలో(kishtwar District) ఈ ఘటన జరిగింది..

Indian Army: నదిలో చిక్కుకున్న ఇద్దరు యువకులు.. ఆర్మీ సైన్యం రెస్క్యూ ఆపరేషన్‌ .. వీడియో వైరల్..
Indian Army
Follow us

|

Updated on: May 10, 2022 | 3:13 PM

Indian Army: భారత సైనికులు దేశాన్ని రక్షించడం మాత్రమే కాదు.. అవసరం అయితే.. ప్రకృతి విపత్తులు, అనుకోని ఆపదలు ఎదురైనప్పుడు తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలను రక్షిస్తారు. ప్రజలకు అండగా నిలబడతారు. ఇదే విషయాన్నీ మరోసారి రుజువు చేశాసారు.. కొంతమంది సైనికులు.. నదిలో చిక్కుకున్న యువకులను అర్ధరాత్రి, నది ఒరవడి లెక్కచేయకుండా కాపాడారు సైనికులు. జమ్ముకశ్మీర్‌లోని(Jammu and Kashmir)కిషాత్‌వార్‌ జిల్లాలో(kishtwar District) ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

సోహల్ గ్రామం సమీపంలో చీనాబ్ నదిని జేసీబీలో దాటేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులు నీటి ప్రవాహం పెరిగిపోవడంతో నదిలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు, పోలీసులు, ఆర్మీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్మీకి చెందిన 17 రాష్ట్రీయ రైఫిల్స్‌ బెటాలియన్‌ సైనికులు అర్ధరాత్రి వేళ రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. నదిలో చిక్కుకున్న యువకులను జేసీబీపైకి చేరాలని చెప్పారు. నదికి ఇరువైపులా ఎత్తులో పెద్ద తాడు కట్టారు. ఒక జవాన్‌ ఆ తాడు ఆసరాతో ఆ యువకుల వద్దకు చేరుకుని వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. అక్కడ గుమిగూడిన స్థానికులు ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను ఎంతో ఉత్కంఠతో వీక్షించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఆర్మీ ఉత్తర కమాండ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. చీనాబ్‌ నదిలో రాత్రి వేళ చిక్కుకున్న యువకులను సైనికులు రక్షించినట్లు అందులో తెలిపింది. దాంతో ఈ వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. యువకులను కాపాడిన భారత సైనికుల ధైర్య సాహసాలను నెటిజన్లు కొనియాడారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..