కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాసానికి విజయశాంతి.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో విజయశాంతి సమావేశమయ్యారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసానికి ఆమె కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి వెళ్లారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో విజయశాంతి సమావేశమయ్యారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసానికి ఆమె కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి వెళ్లారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో డిసెంబర్ 7న ఆమె కాషాయ జెండా కప్పుకోనున్నారు.
గతంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డితో రాములమ్మ సమావేశమయ్యారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ పోలింగ్ రోజున కాషాయపు మాస్క్‌తో దర్శనమిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం విజయశాంతి మంచి నాయకులని కొనియాడారు.