భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణ.. వెలుగులోకి మరో వీడియో

భారత్-చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల ఘర్షణకు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. మంచు కొండలలో భారత సైనికులు, చైనా ఆర్మీ అధికారులు, జవాన్లను వెనక్కు నెడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.

  • Tv9 Telugu
  • Publish Date - 7:10 am, Tue, 23 June 20
భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణ.. వెలుగులోకి మరో వీడియో

భారత్-చైనా సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికుల ఘర్షణకు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. మంచు కొండలలో భారత సైనికులు, చైనా ఆర్మీ అధికారులు, జవాన్లను వెనక్కు నెడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. అలాగే వెనక్కు వెళ్లిపోవాలంటూ భారత సైనికులు గట్టిగా చెబుతున్న మాటలు కూడా అందులో వినిపిస్తున్నాయి. ఇక ఇరు వర్గాలు  బాహాబాహీకి దిగినట్లుగా కూడా కనిపిస్తోంది. మొత్తం 5.30నిమిషాల నిడివి గల ఆ వీడియోలో భారత సైనికుల మాటను వినకుండా, చైనా జవాన్లు అక్కడే ఉండటం, జవాన్లపై దాడి చేయడం వంటివి కనిపిస్తున్నాయి.

అయితే ఆ వీడియో ఎప్పుడు తీశారన్న దానిపై స్పష్టత లేననప్పటికీ.. సైనికులు మాస్క్‌లు ధరించి ఉండటంతో ఇటీవల కాలంలోనే అని తెలుస్తోంది. సిక్కింలో ఈ ఘటన జరిగి ఉండొచ్చని ఆర్మీ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. అక్కడి నకూలా ప్రాంతంలో కూడా మే తొలి వారం నుంచి ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటుండగా.. అప్పటి వీడియోనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే భారత్-చైనాల మధ్య నెలకొన్న ఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Read This Story Also: షాకింగ్..మరో ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా..!