Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మరోసారి ప్రమాదం.. ఇంజన్‌ ముందు భాగం ధ్వంసం.. ఈసారి కూడా కారణమదే..

ముంబై నుంచి గుజరాత్‌కు వస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వరుసగా రెండో రోజు కూడా ప్రమాదానికి గురయ్యింది. కంజరి-ఆనంద్‌ స్టేషన్‌ మధ్య పశువులను వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది.

Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు మరోసారి ప్రమాదం.. ఇంజన్‌ ముందు భాగం ధ్వంసం.. ఈసారి కూడా కారణమదే..
Vande Bharat Express
Follow us

|

Updated on: Oct 07, 2022 | 8:36 PM

ముంబై నుంచి గుజరాత్‌కు వస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వరుసగా రెండో రోజు కూడా ప్రమాదానికి గురయ్యింది. కంజరి-ఆనంద్‌ స్టేషన్‌ మధ్య పశువులను వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దీంతో ఇంజన్‌ ముందుభాగం ధ్వంసం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. గురువారం కూడా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురయ్యింది.నిన్న గుజరాత్‌ లోని వాత్వా స్టేషన్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఇంజన్‌ ముందు భాగం ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యింది. ఈ ప్రమాదంలో నాలుగు గేదెలు చనిపోయాయి.

గురువారం ప్రమాదానికి గురైన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంజన్‌ ముందు భాగాన్ని ముంబైలో యుద్ద ప్రాతిపదికన రిపేర్‌ చేశారు. డ్యామేజ్‌ జరిగిన భాగాలను తొలగించారు. మళ్లీ కొత్త విడి భాగాలను అమర్చారు. కాని ఇవాళ మరోసారి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధాని మోడీ ప్రారంభించిన వారానికే ఈ ట్రైన్ రెండుసార్లు ప్రమాదానికి గురికాడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గురువారం నాడు రైలు వేగంగా వెళ్తున్న క్రమంలో గేదెల గుంపు అడ్డం రావడంతో లోకో పైలట్‌ సడెన్‌ బ్రేక్ వేశారు. దీంతో ఇంజన్‌ ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ముంబై సెంట్రల్‌ నుంచి గుజరాత్‌ లోని గాంధీనగర్‌కు వస్తున్న సమయంలో వాత్వా స్టేషన్‌ దగ్గర ఉదయం 11.15 గంటలకు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇంజన్‌ ముందు భాగం మాత్రమే ధ్వంసం కాగా.. అడ్డొచ్చిన నాలుగు గేదెలు చనిపోయాయి.

ఇవి కూడా చదవండి

కాగా.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి కారణమైన గేదెల యాజమానులపై కేసు నమోదయ్యింది. గుజరాత్‌ ఆర్‌పీఎఫ్‌ పోలీసులు గేదెల యాజమానులపై కేసు నమోదు చేశారు. గుజరాత్‌లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పశువుల యజమానులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. గేదెల యజమానులను రైల్వే పోలీసులు ఇంతవరకు గుర్తించలేకపోయారని.. అందుకోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అహ్మదాబాద్‌లోని వత్వ – మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య వందే భారత్ రైలుకు అడ్డొచ్చిన గేదెల (గుర్తు తెలియని) యజమానులపై ఆర్‌పిఎఫ్ కేసు నమోదు చేసిందని.. డబ్ల్యుఆర్ సీనియర్ ప్రతినిధి (అహ్మదాబాద్ డివిజన్) జితేంద్ర కుమార్ జయంత్ వార్త సంస్థ పీటీఐకి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles