Population policy: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ప్రతిపాదించిన జనాభా విధానం సాధ్యాసాధ్యాలు, రాజకీయ సవాళ్లు ఏంటి.?

దేశంలో అన్ని వర్గాలకు సమానంగా వర్తించే ఒక సమగ్ర జనాభా విధానాన్ని (పాపులేషన్‌ పాలసీ) రూపొందించాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. విస్తృతమైన చర్చలు...

Population policy: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ప్రతిపాదించిన జనాభా విధానం సాధ్యాసాధ్యాలు, రాజకీయ సవాళ్లు ఏంటి.?
Mohan Bhagwat Population Po
Follow us

|

Updated on: Oct 07, 2022 | 9:28 PM

దేశంలో అన్ని వర్గాలకు సమానంగా వర్తించే ఒక సమగ్ర జనాభా విధానాన్ని (పాపులేషన్‌ పాలసీ) రూపొందించాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. విస్తృతమైన చర్చలు, సంప్రదింపుల తర్వాత ఈ విధానాన్ని తయారు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. గత బుధవారం దసరా వేడుకల్లో భాగంగా నాగ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మోహన్‌ భగవత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిటీ ఆధారిత జనాభా అసమతుల్యత అనేది చాలా కీలకమైన అంశమని, దీన్ని విస్మరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. జనాభా అసమతుల్యత అనేది దేశ భౌగోళిక సరిహద్దులను సైతం మార్చేస్తుందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో అసలు ఈ విధానం అమలు సాధ్యమవుతుందా.? బీజేపీ దీనిని సమర్థిస్తుందా.? లాంటి ఆసక్తికరమైన అంశాలను ప్రముఖ సీనియర్‌ జర్నలిస్ట్‌ రాకేష్‌ దీక్షిత్‌ న్యూస్‌9తో పంచుకున్నారు. సమగ్ర జనాభా విధానం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది లాంటి విషయాలు ఆయన మాటల్లోనే…

దేశంలో జనాభా పెరుగుదలకు కారణమవుతోన్న వారిని కంట్రోల్‌ చేసే క్రమంలో గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ప్రస్తుతం మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే హిందూ ముస్లింల జనాభా పెరుగుదలలో గుర్తించిన తేడాలు ఈ అంశాన్ని వివాదస్పదంగా మార్చింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మోదీ ప్రభుత్వం కూడా దీనిని సమర్థించింది. ఇందులో భాగంగానే జనాభా నియంత్రణపై ఎలాంటి షరతులు అవసరం లేదని ఏప్రిల్‌ 2న కేంద్ర ప్రభుత్వం తెలిపిన విషయం విధితమే. దేశంలో హెల్త్‌ కేర్‌ పాలసీలు మెరుగ్గా ఉండడంతో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు వద్దనే నిబంధన అవసరం లేదని తెలిపింది.

బీజేపీ నామినేటెడ్‌ సభ్యుడు రాకేష్‌ సిన్హా జనాభా నియంత్రణ బిల్లు 2019పై జరిగిన చర్చలో భాగంగా ఆరోగ్యమంత్రి మున్సుఖ్‌ మాండవియా మాట్లాడుతూ.. కుటుంబ నియత్రణపై ప్రభుత్వం విస్తృతమైన ప్రజా చైతన్య ప్రచారాలను నిర్వహిస్తోంది, అలాగే అందరికీ అందుబాటులో, సరసమైన ఆరోగ్య సంరక్షణనకు అందించడానికి కృషఙ చేస్తుందని అన్నారు. ఇక బీజేపీ పాలిత ప్రాంతాలైన అస్సో, ఉత్తరప్రదేశ్‌లో సంతనాన్ని ఇద్దరికే పరిమితం చేసే చట్టాన్ని తీసుకురావాలని ప్రతిపాదించాయి. కర్ణాటకలో కూడా అలాంటి చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ పిలుపునిచ్చింది. అయితే ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ గణాంకాలను ఉటంకిస్తూ జనాభౄ నియంత్రణకు ఎలాంటి చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం విముఖ చూపుతున్న నేపథ్యంలో, బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-21) ప్రకారం మొత్తం సంతానోత్పత్తి రేటు (టీఎఫ్‌ఆర్‌) ఒక హిందూ మహిళకు 1.94, ముస్లిం మహిళకు 3.236 పిల్లలు ఉన్నారు. ఈ లెక్కన వీరి మధ్య వ్యత్యాసం కేవలం 0.42 పిల్లలు మాత్రమే ఉన్నారు. 1992లో హిందూ మహిళల కంటే ముస్లిం మహిళలు సగటున 1.1 మంది పిల్లలు ఉన్నారని అంచనా వేసిన నేపథ్యంలో ఇది చాలా తేడా. గత రెండు దశాబ్దాల్లో ముస్లింలలో 35 శాతం ఉన్నా, హిందూ సంతానోత్పత్తి 30 శాతానికి పడిపోయిందని తేలింది. బహుశా 2030 నాటికి హిందూ ముస్లింల సంతానోత్పత్తి రేట్లు సమానవుతతాయని సర్వే నిర్ధారిస్తోంది. ముస్లింలలో సంతానోత్పత్తి రేటు ఇప్పుడు దాదాపు హిందువులతో సమానంగా ఉంది. 1992, 2015 మధ్య కాలంలో ముస్లిం సంతానోత్పత్తి రేటు 4.4 నుంచి 2.6కి తగ్గింది. హిందువుల సంఖ్‌య 3.3 నుంచి 2.1కి పడిపోయింది.

ఎన్‌ఎఫ్‌హెచ్‌సీ 2019-21 ప్రకారం మొత్తం సంతానోత్పత్తి రేటు 2016లో 2.2 నుంచి 2కి తగ్గింది. ఇది కావాల్సిన దాని విలువ 2.1 కంటే తక్కువ. జనాభాపై నిపుణులు, పరిశోధకుల ప్రకారం, 2.1 వద్ద, జనాభా సంతానోత్పత్తి యొక్క భర్తీ స్థాయికి చేరుకుంటుంది – అంటే జనాభాలో పెరుగుదల ఉండదు. భారతదేశం తక్కువ సంతానోత్పత్తి యుగంలోకి ప్రవేశించింది. ఇక భగవత్‌ తన ప్రసంగంలో బలవంతపు మత మార్పిడిల గురించి కూడా ప్రస్తావించారు. హిందూత్వ సంస్థలు కూడా చాలా కాలంగా బలవంతపు మతమార్పిడులు పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా క్రైస్తవ మత ప్రచారకులు దీనికి ఆజ్యం పోస్తున్నారని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ 1971 నుంచి భారత్‌లో క్రైస్తవ జనాభాలో మార్పు కనిపించలేదు. 1971 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో క్రైస్తవులు 2.6 శాతం ఉన్నారు. 2001 నాటికి, ఈ సంఖ్య 2.3 శాతానికి పడిపోయింది. మత మార్పిడి వివాదాస్పద అంశంపై, జూన్ 2021లో విడుదల చేసిన ప్యూ రీసెర్చ్ నివేదిక, భారతదేశంలో ఎవరైనా ఒక మతం నుంచి మరొక మతానికి మారడం ‘అరుదైనది’ అని పేర్కొంది.

ఇక సర్వేలో తేలిన వివరాల ప్రకారం సంతానోత్పత్తి రేటును (TFR) నిర్ణయించేంది విద్య అని సర్వే తెలిపింది. మహిళల విద్యా స్థాయి పెరగడంతో ఈ రేటు క్రమంగా తగ్గుముఖం పట్టిందని సర్వే నివేదిక వెల్లడించింది. అఖిల భారత స్థాయిలో, పూర్తిగా నిరక్షరాస్యులైన మహిళలకు TFR 3, ప్రాథమిక విద్య కంటే తక్కువ ఉన్నవారికి 2.9, గ్రాడ్యుయేట్ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ ఉన్న మహిళలకు 1.7గా ఉంది. ఈ ధోరణి చాలా రాష్ట్రాల్లో కనిపించింది, యువతులకు విద్యను ప్రోత్సహించడం జనాభా పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుందని సర్వే సూచిస్తుంది. ఎక్కువ సంవత్సరాలు విద్యనభ్యసించిన వారికి సహజంగానే వివాహం ఆలస్యం కావడం, అలాగే మొదటి బిడ్డ ఆలస్యంగా పుట్టడానికి దారి తీస్తుందని సర్వేలో తెలిపింది. భారతదేశానికి జనాభా విధానం అవసరం లేదని నిపుణులు, జనాభా శాస్త్రవేత్తలు ఏకగ్రీవంగా చెప్పారు. బదులుగా, మహిళల విద్యపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ దేశంలోని నైపుణ్యం కలిగిన జనాభాను పెంచడానికి ప్రయత్నాలు రెట్టింపు చేయాలి. అయితే, ఇది భారతదేశ జనాభా పెరుగుదలకు కారణమని కాదని యూఎన్‌ నివేదిక తెలిపింది. ప్రస్తుత 1.39 బిలియన్ల జనాభాతో భారతదేశం 2023 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుందని అంచనా వేసింది, ఇది మునుపటి అంచనా కంటే ఐదేళ్ల ముందు చైనాను అధిగమించింది.

ఇక ప్రధాన ఎన్నికల మాజీ కమీషనర్‌ ఎస్‌వై ఖురైషీ తన పుస్తకం ది పాపులేషన్ మిత్: ఇస్లాం, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియాలో ముస్లిం జనాభా సంఖ్యలకు సంబంధించిన అనేక అపోహలను వివరించారు. అతను ఇటీవల మోహన్ భగవత్‌కు పుస్తక ప్రతిని అందించారు, దాని కేంద్ర బిందువులను కూడా క్లుప్తంగా ప్రస్తావించారు. భగవత్‌ దసరా ప్రసంగంపై ఖురైషీ మాట్లాడుతూ.. ‘ఇది చాలా సమగ్రంగా, సమతుల్యంగా ఉంద’ని తెలిపారు. పిల్లల సంఖ్య తల్లి ఆరోగ్యం, విద్య, ఆర్థిక స్థితి, వ్యక్తిగత ఆసక్తిలతో ముడిపడి ఉందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ చెప్పారని ఖురైషీ ప్రస్తావించారు. ముస్లింలు హిందువుల కంటే చాలా వేగంగా కుటుంబ నియంత్రణను అవలంబించారు. ముస్లింలు కుటుంబ నియంత్రణను చాలా చురుగ్గా పాటించాలని కోరుకుంటున్నారని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయని ఆయన వాదించారు. 2019లో, ఒక జంటకు ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తూ జనాభా నియంత్రణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఏది ఏమైనప్పటికీ, జనాభా నియంత్రణను సాధించడానికి ప్రభుత్వం విజయవంతంగా అవగాహన, ఆరోగ్య ప్రచారాలను ఉపయోగించిందని ఆరోగ్య మంత్రి వాదించడంతో ఈ సంవత్సరం ప్రారంభంలో దీనిని ఉపసంహరించుకున్నారు. (Source Link)

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు