AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dussehra: రావణుడి 10 తలలు దహనంకాలేదని ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్

దసరా ఉత్సవాల్లో భాగంగా రావణ దహనంలో రావణుడి దిష్టిబొమ్మకున్న ఉన్న పది తలల్లో ఒక్కటి కూడా మంటల్లో కాలిపోలేదని ఓ ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్‌ అయ్యాడు. మరో నలుగురు అధికారులకు..

Dussehra: రావణుడి 10 తలలు దహనంకాలేదని ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్
Ravan Dahan
Srilakshmi C
|

Updated on: Oct 07, 2022 | 9:12 PM

Share

దసరా ఉత్సవాల్లో భాగంగా రావణ దహనంలో రావణుడి దిష్టిబొమ్మకున్న ఉన్న పది తలల్లో ఒక్కటి కూడా మంటల్లో కాలిపోలేదని ఓ ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్‌ అయ్యాడు. మరో నలుగురు అధికారులకు షోకాజ్‌ నోటీస్‌ జారీ అయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరిలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమంలో ఆ సంఘటన చోటు చేసుకుంది. డీఎంసీ ఆధ్వర్యంలో స్థానికంగా నిర్వహించిన దిష్టిబొమ్మ దహనంలో పది తలలు చెక్కుచెదరకుండా ఉన్నాయని, శరీరం మాత్రమే బూడిదయ్యిందని, రావణుడి గడ్డి బొమ్మ తయారీ పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంటూ, క్లర్క్‌గా పనిచేస్తున్న రాజేంద్ర యాదవ్‌ను ధామ్తరి మున్సిపల్ కార్పొరేషన్ సస్పెండ్‌ చేసింది.

విజయదశమి దుర్గా పూజ రావణ దహనంతో ముగస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో రావణుడి గడ్డి బొమ్మ పూర్తిగా దహనం అవ్వలేదని, ఈ చర్య డీఎమ్‌సీ ప్రతిష్టను దెబ్బతీసిందని తన ఆర్డర్‌లో పేర్కొంది. గడ్డి బొమ్మ తయారీ పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు క్లర్క్‌గా పనిచేస్తున్న రాజేంద్ర యాదవ్‌ను డీఎంసీ సస్పెండ్ సస్పెండ్‌ చేయగా, అసిస్టెంట్ ఇంజినీర్ విజయ్ మెహ్రా, సబ్ ఇంజినీర్లు లోమస్ దేవాంగన్, కమలేశ్‌ ఠాకూర్, కమతా నాగేంద్రలకూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గడ్డిబొమ్మను తయారు చేసే బాధ్యతలు అప్పగించిన వారిపై చర్యలు తీసుకుంటామని ధమ్‌తరి మేయర్ విజయ్ దేవాంగన్ మీడియాకు తెలిపారు.