Vande Bharat Express: ఇండియన్ రైల్వేలో గేమ్ ఛేంజర్ ఇదే.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు స్పీడ్ తెలిస్తే మతిపోవాల్సిందే..

ఈ సెమీ హైస్పీడ్ రైలు.. విమానం లాంటి ప్రయాణ అనుభూతిని ఇస్తుంది. దీనికి తోడు గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలుకు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Vande Bharat Express: ఇండియన్ రైల్వేలో గేమ్ ఛేంజర్ ఇదే.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు స్పీడ్ తెలిస్తే మతిపోవాల్సిందే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు. మూడు నెలల స్వల్ప వ్యవధిలో తెలంగాణ నుంచి ప్రారంభం కానున్న రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ రైలు రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు మూడున్నర గంటలు తగ్గిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల యాత్రికుల ప్రయాణీకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భారతదేశ స్వదేశీ సెమీ-హై స్పీడ్ రైలు ఐటి సిటీ హైదరాబాద్‌.. తిరుపతి మధ్య పరుగులు తీయనుంది.
Follow us

|

Updated on: Mar 01, 2023 | 4:37 PM

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌.. ఇండియన్ రైల్వే వ్యవస్థలో నవ శకానికి నాంది పలికింది. ఈ సెమీ హైస్పీడ్ రైలు.. విమానం లాంటి ప్రయాణ అనుభూతిని ఇస్తుంది. దీనికి తోడు గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలుకు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా కవచ్ టెక్నాలజీ. రైళ్లు పరస్పరం ఢీకొట్టుకోకుండా నివారించేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఇది. పట్టాలపై పరుగులు పెట్టే అల్యూమినియం రైళ్లు భారతీయ రైల్వేలకు గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోందిని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) మాజీ GM సుధాన్షు మణి అన్నారు.

భారతీయ రైల్వే రాబోయే సంవత్సరాల్లో 100 అల్యూమినియం వందే భారత్ రైలు సెట్లను తయారు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇది జాతీయ రవాణాదారు కోసం మొదటిది. ఇటీవలే రూ.30,000 కోట్ల ప్రాజెక్టుకు సాంకేతిక బిడ్లు దాఖలయ్యాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఆవిష్కర్త అని కూడా పిలువబడే సుధాంశు మణి , అల్యూమినియం రైళ్లు గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణించగలవని అంటారు.

భారతీయ రైల్వే రూపురేఖలను వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు మార్చేసింది. భారతీయ రైల్వేలు, ప్రయాణీకుల కోసం అల్యూమినియం రైళ్ల ప్రయోజనాలు, వాటి ఫీచర్లు, అవకాశం ఛార్జీలు, వ్యాపార అవకాశం, ఎగుమతి సామర్థ్యం గురించి సుధాన్షు మణి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

నవ శకానికి నాంది..

రెండు ప్రధాన రైల్వే పరికరాల తయారీ సంస్థలు –  స్విస్ మేజర్ స్టాడ్లర్ మేధా సర్వో.. ఫ్రాన్స్‌కు చెందిన ఆల్‌స్టోమ్‌తో టై-అప్‌లో అల్యూమినియం రైలు సెట్‌లను భారతదేశంలో తయారు చేయడానికి బిడ్‌లను సమర్పించాయి. టెండర్ ప్రకారం, ఈ 100 అల్యూమినియం రైలు సెట్లు స్లీపర్ రైళ్లుగా వీరు తయారు చేయాల్సి ఉంది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును 2019లో తొలిసారిగా ఢిల్లీ-వారణాసి మార్గంలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి మరో 9 వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మొదటి రెండు రైళ్లు ప్రోటోటైప్‌లు అయితే, భారతీయ రైల్వేలు వందే భారత్ 2.0 అప్‌గ్రేడ్ చేసిన రైళ్లను 2022 మధ్య నుంచి విడుదల చేయడం ప్రారంభించాయి.

వాటి ప్రస్తుత రూపంలో, వందే భారత్ రైళ్లు ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్లు, ఫీచర్ల పరంగా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే మెరుగైనవి. సెమీ-హై స్పీడ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ వందే భారత్ రైళ్లు గంటకు 160 కి.మీ వేగంతో పరుగులు పెట్టగలవు.

భారతీయ రైల్వే ఇప్పుడు వందే భారత్ రైళ్ల స్లీపర్ వెర్షన్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. 200 స్లీపర్ వందే భారత్ రైళ్లు – రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మరింత ప్రీమియం వెర్షన్ ..  రాబోయే సంవత్సరాల్లో ఈ రైళ్లు పట్టాలు ఎక్కుతాయని భావిస్తున్నారు. అదే సమయంలో, జాతీయ రవాణా సంస్థ అల్యూమినియం రైళ్ల తయారీ నైపుణ్యాన్ని పొందాలని ఆశిస్తోంది.

వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
వర్షంలో రీల్స్‌ చేస్తూ జారిపడ్డ లేడీ డాన్స్ మాస్టర్! వీడియో వైరల్
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
సరియానా సంభవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న రజినీ కూలి.
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!