Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varanasi: వారణాసిలో నలుగురు పర్యాటకులు ఆత్మహత్య .. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వాసులుగా గుర్తింపు

కైలాష్ భవన్ ఉద్యోగులు దశాశ్వమేధ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా లోపలి దృశ్యం చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. లోపల నలుగురి మృతదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వారణాసి పోలీసు కమిషనర్ అశోక్ జైన్ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని గదిని పరిశీలించారు.

Varanasi: వారణాసిలో నలుగురు పర్యాటకులు ఆత్మహత్య .. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వాసులుగా గుర్తింపు
Varanasi Police
Follow us
Surya Kala

|

Updated on: Dec 08, 2023 | 8:31 AM

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. దశాశ్వమేధ్ పోలీస్ స్టేషన్ పరిధి లోని దేవనాథపురలో ఉన్న కైలాష్ భవన్‌లోని మూడో అంతస్తులో నలుగురు పర్యాటకులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న నలుగురు పర్యాటకులు ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు పురుషులు కాగా, ఒకరు మహిళ. సమాచారం అందుకున్న పోలీసు కమిషనర్‌తో పాటు బలగాలు కైలాష్‌ భవన్‌కు చేరుకున్నాయి. పోలీసులు అన్ని మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు గదిలో సోదా చేయగా తెలుగులో రాసిన సూసైడ్ నోట్ దొరికింది.

సమాచారం ప్రకారం ఈ నెల డిసెంబర్ 3 న, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యక్తులు పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసికి వచ్చారు. ఆంధ్రా ఆశ్రమంగా పిలువబడే కైలాష్ భవన్‌లో విడిది చేశారు. కొండబాబు (50), లావణ్య (45)లతో పాటు  వీర వెంకట్ సూర్యమోహన్ రాజేష్ (25), జయరామ్ (23)లు కైలాష్ భవన్‌లో గురువారం (డిసెంబర్ 7వ తేదీ) శవమై కనిపించారు. దశాశ్వమేధ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది. కొండబాబు లావణ్య భార్యాభర్తలు కాగా రాజేష్, జయరామ్ కుమారులు అని తెలుస్తోంది. గురువారం ఎంత సేపైనా నలుగురు బయటకు రాకపోవడంతో పాటు.. గది తలుపులు కూడా ఒక్కాసారి కూడా తెరవలేదు. దీంతో కైలాష్‌ భవన్‌లోని ఉద్యోగులు అవాక్కయ్యారు. తలుపు దగ్గరికి వెళ్లి పిలవడం మొదలుపెట్టాఋ.. అయినా  తలుపు తెరవలేదు. దీంతో ఉద్యోగస్తులకు అనుమానం వచ్చింది.

గదిలో నలుగురి మృతదేహాలు

కైలాష్ భవన్ ఉద్యోగులు దశాశ్వమేధ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా లోపలి దృశ్యం చూసి పోలీసులు కూడా అవాక్కయ్యారు. లోపల నలుగురి మృతదేహాలు కనిపించాయి. దీంతో పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వారణాసి పోలీసు కమిషనర్ అశోక్ జైన్ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని గదిని పరిశీలించారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై స్పందించిన కమిషనర్…

విచారణలో గదిలో తెలుగులో రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. ఘటనాస్థలం నుంచి సూసైడ్ నోట్ లభ్యమైనట్లు పోలీసు కమిషనర్ ముఠా అశోక్ జైన్ తెలిపారు. మృతులు నలుగురూ ఒకే కుటుంబానికి చెందినవారని.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారని పేర్కొన్నారు. అయితే తమ  కుటుంబం ఆర్థికంగా చితికిపోయిందని సూసైడ్ నోట్‌లో ఉన్నట్లు.. ఈ కుటుంబం గత రెండు నెలలుగా ఇల్లు విడిచి వివిధ ప్రదేశాలకు తిరుగున్నరని.. తెలుస్తోంది. తమ డబ్బులు తీసుకుని కొందరు తమను మానసికంగా వేధిస్తున్నారని సూసైడ్ నోట్‌లో కుటుంబసభ్యులు ఆరోపించారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు.

గురువారం ఉదయమే గది ఖాళీ చేయాల్సి ఉన్నా

నలుగురు పర్యాటకులు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా వాసులు అని పోలీసు కమిషనర్ తెలిపారు. ఈ నలుగురూ గురువారం ఉదయం గదిని ఖాళీ చేయవలసి ఉంది. అయితే గది నుంచి ఎటువంటి అలికిడి వినిపించకపోవడం.. ఎవరూ గది నుండి బయటకు రాకపోవడంతో కైలాష్ భవన్ ఉద్యోగులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..