
Mulayam Singh Wife: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధన గుప్తా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. సాధన గుప్తా కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవడంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆమెను ఇంటెన్సీవ్ కేర్ యూనిట్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా, సాధన గుప్త ములాయం సింగ్ యాదవ్ రెండవ భార్య. ఆమె కొడుకు ప్రతీక్ యాదవ్. భారతీయ జనతా పార్టీ నాయకురాలు అపర్ణా యాదవ్ ఆమె కోడలు.
కాగా, మూలాయం సింగ్ యాదవ్ భార్య మృతి పట్ల సంతాపం ప్రకటించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. సాధనా గుప్త మృతి బాధాకరం అన్నారు. మూలాయం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
समाजवादी पार्टी के संरक्षक आदरणीय नेता जी की पत्नी श्रीमती साधना यादव जी की मृत्यु , अत्यंत दुःखद।
भावपूर्ण श्रद्धांजलि।
— Samajwadi Party (@samajwadiparty) July 9, 2022