Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు బెదిరింపు సందేశం..

|

Apr 25, 2023 | 10:12 AM

ఉత్తరప్రదేశ్‌లోని సీఎం యోగీ ఆదిత్యానాథ్ కు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. లక్నోలోని ఓ గుర్తు తెలియని వ్యక్తి 'డయల్ 112' ద్వారా సీఎం యోగీకి బెదిరింపు సందేశం పంపాడు. త్వరలోనే ముఖ్యమంత్రిని యోగీని చంపేస్తానంటూ రాసుకొచ్చాడు.

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు బెదిరింపు సందేశం..
Cm Yogi Adityanath
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని సీఎం యోగీ ఆదిత్యానాథ్ కు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. లక్నోలోని ఓ గుర్తు తెలియని వ్యక్తి ‘డయల్ 112’ ద్వారా సీఎం యోగీకి బెదిరింపు సందేశం పంపాడు. త్వరలోనే ముఖ్యమంత్రిని యోగీని చంపేస్తానంటూ రాసుకొచ్చాడు. దీన్ని చూసి ఆశ్చర్యపోయిన 112 ఆపరేషన్ కమాండర్ అధికారులు ఆ గుర్తు తెలియని వ్యక్తిపై సుశాంత్ గోల్ఫ్‌సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజల అత్యవసర సేవల కోసం గతంలో యూపీ ప్రభుత్వం ‘డయల్ 112’ నంబర్‌ను ప్రారంభించింది.

అలాగే ఆదివారం రోజున ప్రధాని మోదీకి కూడా బెదిరింపు సందేశం వచ్చింది. ఓ వ్యక్తి.. ఏప్రిల్ 24 న ప్రదాని మోదీ కొచ్చికి వచ్చినప్పుడు ఆత్మహుతి బాంబు దాడికి పాల్పడుతానంటూ లెటర్ రాశాడు. దీంతో వెంటనే నిందితుడి కోసం పోలీసులు గాలించి అతను క్సేవియర్‌గా గుర్తించారు. అనంతరం ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు కొచ్చి పోలీసులు తెలిపారు. తన వ్యక్తిగత కారణంతోనే పొరిగింటి వ్యక్తిని ఇరికించేందుకు ఈ ఉత్తరం రాసినట్లు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ సహాయంతో అతడ్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ కొచ్చి పర్యటనలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..