AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Yogi Cabinet: 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. త్వరలో కేబినెట్ విస్తరణ

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి నుంచే అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి.

CM Yogi Cabinet: 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. త్వరలో కేబినెట్ విస్తరణ
Yogi Adityanath Meets Amit Shah
Balaraju Goud
|

Updated on: Aug 20, 2021 | 3:46 PM

Share

Uttar Pradesh Cabinet Expansion: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి నుంచే అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ అప్పుడే కసరత్తు మొదలు పెట్టింది. 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నివాసంలో బీజేపీ సీనియర్ నేతలతో దాదాపు మూడున్నర గంటల పాటు చర్చలు జరిపారు.

ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ పాల్గొన్నారు. యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యోగి ఆదిత్యనాథ్ త్వరలోనే తన మంత్రివర్గాన్ని విస్తరించేందుకు చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రాంతీయ, సామాజిక, కుల ప్రాతిపదికన మరో 5-7 మందిని మంత్రులుగా తీసుకోవాలని ఈ సమావేశంలో నేతలు నిర్ణయానికి వచ్చారు. ఈ విషయంపై రానున్న మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఆ తర్వాత కేబినెట్ విస్తరణ తేదీని ఖరారు చేయనున్నారు. మరో 15 రోజుల్లోనే ఈ కేబినెట్ విస్తరణ పూర్తి కానున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. కొత్తగా ఐదు నుంచి ఏడుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

యుపీ అసెంబ్లీ ఎన్నికలు 2022 దృష్ట్యా, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూపీ సీఎం యోగి కేబినెట్‌లో మొత్తం 54 మంది మంత్రులు ఉన్నారు. ఇందులో 23 మంది కేబినెట్ మంత్రులు కాగా, 9 మంది స్వతంత్ర మంత్రులు, 22 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. నిబంధనల ప్రకారం మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగా మతపరమైన సమాన ప్రాతినిథ్యంలో కల్పించాలని భావిస్తున్నారు. ఓబీసీ, బ్రాహ్మణ సహా ఇతర కులాల నుంచి కొంత మందికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఈ నెల 23న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. యూపీ పార్టీ కార్యకర్తలతో మాట్లాడనున్నారు. ఈ భేటీలో బూత్ అధ్యక్షులతో సహా 2,700 మంది సెక్టార్ ప్రతినిధులతో నడ్డా భేటీ అవుతారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ సమావేశం నుంచే కార్యకర్తను సమాయాత్తం చేయనున్నారు నడ్డా.

Read Also…  Dubbaka Temple: భక్తి ఉన్న అందరిదీ ఒకే ఫ్యామిలీ.. ఆ ఘనత కేసీఆర్‌దే, శంషాబాద్‌లో అతిపెద్ద ప్రతిష్ట: చిన్నజీయర్‌ స్వామి