Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: చెల్లెలితో యువకుడి ప్రేమాయణం.. అది తెలిసిన ఆ ఇద్దరు సోదరులు ఏం చేశారంటే..

Crime News: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. తమ సోదరితో సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని ఇద్దరు సోదరులు హతమార్చారు.

Crime News: చెల్లెలితో యువకుడి ప్రేమాయణం.. అది తెలిసిన ఆ ఇద్దరు సోదరులు ఏం చేశారంటే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 20, 2021 | 2:51 PM

Crime News: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. తమ సోదరితో సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని ఇద్దరు సోదరులు హతమార్చారు. ఈ ఘటన నాగ్‌పూర్‌లోని కపిల్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ హత్యకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గడ్డిగోడం ప్రాంతానికి చెందిన కమలేష్ బందు సహారే(27)కి వివాహం జరిగింది. అతనికి ఓ కుమార్తె కూడా ఉంది. అయితే, సహారే తన భార్యతో విడిపోయాడు. అప్పటి నుంచి కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సహారే ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయికి అనేక బహుమతులు అందజేశాడు. పర్సనల్‌గా మాట్లాడుకునేందుకు మొబైల్ ఫోన్ కూడా కొనిచ్చాడు. అయితే విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు.. వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఘర్షణలు కూడా జరిగాయి. ఏకంగా యువతితోనే పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఈ కేసులో సహారే‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. ఇటీవలె జైలు నుంచి విడుదలయ్యాడు.

కాగా, జైలు నుంచి విడుదలైన సహారే.. యుతిని ఫాలో అవడం ప్రారంభించాడు. ప్రతీ రోజూలు ఆమె వెనుక వెల్లడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం కూడా సహారే ఆ అమ్మాయిని ఫాలో అయ్యాడు. అయితే, అతను ఫాలో అవుతున్న విషయాన్ని యువతి గమనించి.. తన సోదరులకు తెలియజేసింది. రోజూ లాగే అతను గురువారం కూడా యువతిని ఫాలో అవుతుండగా.. అమ్మాయి ఇద్దరు సోదరులు, వారి స్నేహితులు సహారేను పట్టుకున్నారు. అతని వాగ్వాదానికి దిగారు. ఘర్షణ తీవ్రమవడంతో.. సహారేను కత్తితో పొడిచారు. ఈ దాడిలో సహారే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. నిందితులు పారిపోయారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.

Also read:

Pushpa: అన్ని భాషల్లో అదరగొడుతున్న పుష్ప సాంగ్.. యూట్యూబ్ రికార్డ్స్ బద్దలుకొడుతున్న పాట..

KRMB: కృష్ణానది యాజమాన్య బోర్డుపై ఏపీ ఒత్తిడి తీవ్రతరం.. 27న కేఆర్ఎంబీ భేటీ నేపథ్యంలో మరో లేఖ

Murder Mystery: స్మార్ట్‌లో కారులో ఇస్మార్ట్ స్కెచ్‌..మాట్లాడుతూ మాట్లాడుతూనే మర్డర్‌.. ప్రీ ప్లాన్డ్‌ కోల్డ్‌ బ్లడెడ్ అంటున్న పోలీసులు