ఇదేం మాస్ మసాలా మావ.! భార్య చెల్లితో భర్త జంప్.. ఆపై బావ సోదరితో బామ్మర్ది పరార్!
ఉత్తరప్రదేశ్‌లో ఒక టెలివిజన్ సీరియల్ పోలిన అరుదైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఒక యువకుడు తన భార్య సోదరి మరదలితో పారిపోయాడు. ఆ మరుసటి రోజే అతని బావమరిది తన సోదరితో జంప్ అయ్యాడు. ఈ అనూహ్య ఘటన చూసి అంతా షాక్ అయ్యారు. అయితే, రెండు కుటుంబాలు సామరస్యంగా ఈ విషయాన్ని పరిష్కరించుకున్నట్లు సమాచారం.

ఉత్తరప్రదేశ్‌లో ఒక టెలివిజన్ సీరియల్ పోలిన అరుదైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఒక యువకుడు తన భార్య సోదరి మరదలితో పారిపోయాడు. ఆ మరుసటి రోజే అతని బావమరిది తన సోదరితో జంప్ అయ్యాడు. ఈ అనూహ్య ఘటన చూసి అంతా షాక్ అయ్యారు. అయితే, రెండు కుటుంబాలు సామరస్యంగా ఈ విషయాన్ని పరిష్కరించుకున్నందున ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని పోలీసులు మంగళవారం (సెప్టెంబర్ 16) తెలిపారు.
దేవ్రానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలుపూర్ గ్రామంలో ఆగస్టు నెలలో ఈ అరుదైన సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఆరు సంవత్సరాల క్రితం వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల తండ్రి అయిన కేశవ్ కుమార్ (28) ఆగస్టు 23న తన 19 ఏళ్ల మరదలితో పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన ఒక రోజు తర్వాత, కేశవ్ భార్య సోదరుడు రవీంద్ర (22) తన బావ (కేశవ్) సోదరి, 19 ఏళ్ల యువతితో కలిసి నిశ్శబ్దంగా ఇంటి నుండి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ రెండు సంఘటనలతో రెండు కుటుంబాలు షాక్‌కు గురయ్యాయి. అనంతరం నవాబ్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవాబ్‌గంజ్ స్టేషన్ ఇన్‌ఛార్జి అరుణ్ కుమార్ శ్రీవాస్తవ ఈ విషయంపై మాట్లాడుతూ, “మేము సెప్టెంబర్ 14, 15 తేదీలలో రెండు జంటలను గుర్తించాము” అని అన్నారు. అయితే రెండు కుటుంబాలు తరువాత పోలీస్ స్టేషన్‌లో సమస్యను పరిష్కరించుకోవడానికి అంగీకరించాయని ఆయన అన్నారు. ఆ తర్వాత ఘర్షణకు బదులుగా రాజీపడే అరుదైన క్షణం జరిగింది. కుల పెద్దల సమక్షంలో, రెండు కుటుంబాలు ఆ జంటలను ఒంటరిగా వదిలేయాలని, చట్టపరమైన చర్య తీసుకోకూడదని నిర్ణయించుకున్నాయి. దీంతో కేసు మూసివేసినప్పటికీ, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




