పెళ్లి కోసం సౌదీ నుంచి వచ్చిన యువకుడు.. వివాహమైన రెండు నెలలకే ఆత్మహత్య!
విషాదకర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడి మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. తమ కొడుకును అతని భార్య కుటుంబ సభ్యులు హత్య చేసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కొడుకు విదేశాల్లో పనిచేశాడని, ఇటీవల సెలవుపై ఇంటికి తిరిగి వచ్చాడని పేర్కొంటూ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విషాదకర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడి మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. తమ కొడుకును అతని భార్య కుటుంబ సభ్యులు హత్య చేసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కొడుకు విదేశాల్లో పనిచేశాడని, ఇటీవల సెలవుపై ఇంటికి తిరిగి వచ్చాడని పేర్కొంటూ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలోని లాలాపూర్ పిపల్సానా గ్రామానికి చెందిన డానిష్ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతను సౌదీ అరేబియాలో ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం సెలవుపై ఇంటికి తిరిగి వచ్చాడు . అతను అదే గ్రామానికి చెందిన ఒక యువతితో చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. కానీ రెండు కుటుంబాలు ఆ సంబంధానికి వ్యతిరేకించాయి. అక్టోబర్ 13న, ఆ మహిళ అకస్మాత్తుగా డానిష్ ఇంటికి వచ్చి వివాహం కోసం పట్టుబట్టింది . ఆమె వెంటనే వివాహం చేసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సూరజ్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని శాంతింపజేసింది. ఇంతలో, ఒక స్థానికుడు వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. అక్కడ వారికి వివాహం చేయించాడు.
రెండు రోజుల తర్వాత, శుక్రవారం (అక్టోబర్ 17) ఉదయం, డానిష్ తల్లి రైసా ఖాటూన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ కుటుంబ సభ్యులు కర్రలతో తమ ఇంటికి వచ్చి దాడి చేశారని ఆమె ఫిర్యాదు చేసింది. తీవ్ర మనస్తాపానికి గురైన డానిష్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే, గ్రామంలోని ఒక పొలంలో ఉన్న యూకలిప్టస్ చెట్టుకు ప్లాస్టిక్ తాడుతో వేలాడుతూ ఉన్న డానిష్ మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. ఆ మహిళ కుటుంబం తన కొడుకును హత్య చేసి ఆత్మహత్యగా చూపించాలని కుట్ర పన్నిందని రైసా ఖాటూన్ ఆరోపించింది. డానిష్‌ను బలవంతంగా వివాహం చేసుకున్నారని ఆమె చెప్పారు.
ఆత్మహత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక అందిన తర్వాతే మరణానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో మృతుడి తండ్రి ఖలీల్ అహ్మద్ ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు ఆధారంగా బాలిక కుటుంబంలోని నలుగురు సభ్యులపై కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదులో అనేక తీవ్రమైన ఆరోపణలు చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




