Online General Ticket Booking: ఇకపై జనరల్‌ టికెట్ల బుకింగ్‌ కూడా ఆన్‌లైన్‌లోనే.. ఎలా చేస్తారంటే?

రైల్వే ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వేస్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. జనరల్ టికెట్ల బుకింగ్‌ కోసం ఇకపై లైన్లలో ప్రయాణికులు బారులు తీరాల్సిన అవసరం లేదని చెప్పింది. నిత్యం టికెట్ల కొనుగోలుకు రైల్వే స్టేషన్లలోని టికెట్‌ కౌంటర్ల వద్ద జనాలు కిటకిటలాడుతూ ఉంటారు. ఇకపై ఆ సమస్యలన్నింటికీ చెక్‌ పెడుతూ రైల్వే విభాగం ఆన్‌లైన్‌లోనే టికెట్లు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అందుకు కొత్తగా మొబైల్‌ యాప్‌ను ప్రవేశ పెట్టింది. జనరల్ టికెట్లను కొనుగోలు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే కొత్తగా యూటీఎస్‌ మొబైల్ యాప్‌ను..

Online General Ticket Booking: ఇకపై జనరల్‌ టికెట్ల బుకింగ్‌ కూడా ఆన్‌లైన్‌లోనే.. ఎలా చేస్తారంటే?
Online General Ticket Booking
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 15, 2023 | 3:53 PM

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: రైల్వే ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వేస్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. జనరల్ టికెట్ల బుకింగ్‌ కోసం ఇకపై లైన్లలో ప్రయాణికులు బారులు తీరాల్సిన అవసరం లేదని చెప్పింది. నిత్యం టికెట్ల కొనుగోలుకు రైల్వే స్టేషన్లలోని టికెట్‌ కౌంటర్ల వద్ద జనాలు కిటకిటలాడుతూ ఉంటారు. ఇకపై ఆ సమస్యలన్నింటికీ చెక్‌ పెడుతూ రైల్వే విభాగం ఆన్‌లైన్‌లోనే టికెట్లు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అందుకు కొత్తగా మొబైల్‌ యాప్‌ను ప్రవేశ పెట్టింది. జనరల్ టికెట్లను కొనుగోలు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే కొత్తగా యూటీఎస్‌ మొబైల్ యాప్‌ను ప్రవేశ పెట్టింది. యూటీఎస్‌ అంటే అన్ రిజర్వ్డ్ టికెటింగ్‌ సిస్టమ్‌ యాప్‌. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ సెప్టెంబర్ నెల నాటికి అన్ రిజర్వ్‌డ్‌ టికెట్ బుకింగ్ సిస్టమ్ (UTS) మొబైల్ యాప్ ద్వారా 14.8 శాతం జనరల్ టిక్కెట్లను విక్రయించింది. ఈ యాప్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. జనరల్ టికెట్లతోపాటు ఫ్లాట్ ఫారమ్ టికెట్లు, సీజన్ టికెట్లను ఈ యాప్‌ ద్వారా కొనుగోలు చేసుకునే వెసులుబాటు దక్షిణ మధ్య రైల్వే కల్పించింది.

యూటీఎస్‌ ద్వారా ఎలా టికెట్లు బుక్ చేసుకోవాలంటే..

  • ముందుగా స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టో్ర్ నుంచి యూటీఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌ డౌన్‌లోడ్‌ పూర్తయిన తర్వాత అకౌంట్‌ రిజిస్టర్‌ చేసుకోవడానికి.. పేరు, ఫోన్ నెంబర్, పాస్ వర్డ్ వంటి ఇతర వివరాలను నమోదు చేసుకోవాలి.
  • అనంతరం రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ (OTP) వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత యూటీఎస్ యాప్‌లో మన అకౌంట్ రిజిస్టర్ అవుతుంది.
  • యాప్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన అవ్వడానికి ఫోన్ నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్‌ చేయాలి.
  • ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత యాప్‌లో టికెట్ల కేటగిరీలు కనిపిస్తాయి. నార్మల్ బుకింగ్ ఆప్షన్‌లో జనరల్ టికెట్లు, సీజన్ టికెట్లు, ఫ్లాట్ ఫారమ్ టికెట్ల కేటగిరీలలో మీకు కావల్సిన కేటగిరీ ఎంపిక చేసుకోవాలి.
  • ఒక వేళ మీరు జనరల్ టికెట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఆ కేటగిరీని ఎంచుకోవాలి.
  • ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నరు, ఎంత మంది ప్రయాణికులు, చిన్నారులు, పెద్దలు ఎంత మంది ఉన్నారు? వంటి వివరాలు పొందు నమోదు చేయాలి.
  • ఆ తర్వాత క్యాష్‌ పేమెంట్ వస్తుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ ఇలా ఏవిధంగానైనా టికెట్లను కొనుగోలు చేయవచ్చు.
  • క్యాష్‌ పేమెంట్ పూర్తయితే ఆన్‌లైన్‌లో టికెట్‌ కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లే. షో టికెట్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే బుకింగ్ వివరాలు కనిపిస్తాయి.
  • డౌన్‌లోడ్‌ చేసుకోవాలనుకుంటే.. బుక్‌ చేసుకున్న ఆన్‌లైన్‌ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్‌ అవుట్‌ తీసుకోవాలి.
  • ట్రైన్‌లో ప్రయాణించేటప్పుడు టీసీలకు ఈ టికెట్‌ను చూపిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ విధానం ద్వారా సమయం, శ్రమ ఆదా అవుతాయి.
  • అయితే టికెట్‌ బుకింగ్‌ చేసేటప్పుడు ఈ విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే.. ఏ రోజున ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఏ రోజు మాత్రమే జనరల్ టికెట్‌ను కొనుగోలు చేయాలి. ముందు రోజు చేస్తే అది చెల్లదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!