సన్నిహిత సంబంధాలు – వ్యూహాత్మక భాగస్వామ్యం.. త్వరలో భారత్ పర్యటనకు డొనాల్డ్ ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది 2027 ఆరంభంలో భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పర్యటనకు సంబంధించిన వివరాలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధికారికంగా ప్రకటించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను, వ్యూహాత్మక అంశాలను ఖరారు చేసేందుకు తాను త్వరలోనే భారతదేశంలో పర్యటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది 2027 ఆరంభంలో భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పర్యటనకు సంబంధించిన వివరాలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధికారికంగా ప్రకటించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను, వ్యూహాత్మక అంశాలను ఖరారు చేసేందుకు తాను త్వరలోనే భారతదేశంలో పర్యటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఉన్న బలమైన వ్యక్తిగత అనుబంధమే ఇరు దేశాల సంబంధాలకు ప్రధాన పునాది అని మార్కో రూబియో కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదిగిందని ఆయన ప్రశంసించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్, అమెరికా, వెనిజులా దేశాల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయని, ముఖ్యంగా ఇంధన సరఫరాలను పెంచడంపై దృష్టి సారించామని రూబియో స్పష్టం చేశారు. భారీ స్థాయిలో ముడి చమురును శుద్ధి చేసే అరుదైన సామర్థ్యం భారతదేశానికి ఉండటం ఇరు దేశాల భాగస్వామ్యానికి మరింత బలాన్ని ఇస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారయ్యే దశకు చేరుకుందని భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. రెండు దేశాలు అపారమైన సామర్థ్యం కలిగిన సహజ భాగస్వాములని ఆయన పేర్కొన్నారు. కేవలం కొన్ని సాంకేతిక అంశాలు మాత్రమే పరిష్కరించుకోవాల్సి ఉందని, త్వరలోనే ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, ట్రంప్‌లు ఇద్దరూ ఒకే రకమైన దేశహిత దృక్పథాన్ని కలిగి ఉన్నారని గోర్ గుర్తుచేశారు.
అధ్యక్షుడు ట్రంప్ చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో భారతదేశాన్ని సందర్శించారు. ఆ సమయంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన భారీ ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత ఇరు దేశాల అధినేతలు నిరంతరం సంప్రదింపులు జరుపుకుంటూనే ఉన్నారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశంలో కూడా వీరిద్దరూ ప్రత్యేకంగా భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించారు. వచ్చే ఏడాది జరగబోయే ట్రంప్ పర్యటన భారత్-అమెరికా రక్షణ, వాణిజ్య, ఇంధన రంగాలలో సరికొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
